Begin typing your search above and press return to search.

విక్ క్యాట్ అన్యోన్య దాంప‌త్య ర‌హ‌స్యాలు

బాలీవుడ్ ల‌వ్ క‌పుల్ విక్కీ కౌశ‌ల్- క‌త్రిన కైఫ్ ఆద‌ర్శ దాంప‌త్యం యూత్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. కొత్త జంట‌ల‌కు నిజంగా లైఫ్ గోల్స్ ని సెట్ చేస్తోంది ఈ జోడీ.

By:  Tupaki Desk   |   17 May 2025 9:46 AM IST
విక్ క్యాట్ అన్యోన్య దాంప‌త్య ర‌హ‌స్యాలు
X

బాలీవుడ్ ల‌వ్ క‌పుల్ విక్కీ కౌశ‌ల్- క‌త్రిన కైఫ్ ఆద‌ర్శ దాంప‌త్యం యూత్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. కొత్త జంట‌ల‌కు నిజంగా లైఫ్ గోల్స్ ని సెట్ చేస్తోంది ఈ జోడీ. విక్ క్యాట్ వీలున్నంత‌వ‌ర‌కూ త‌మ లైఫ్ ని జోయ్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. ఒక‌రికోసం ఒక‌రుగా, అన్యోన్యంగా ఈ జంట వెకేష‌న్స్ లో ఆస్వాధిస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ‌గా మారుతున్నాయి. తాజాగా విక్ క్యాట్ బీచ్ వెకేష‌న్ లో చిల్ అవుతున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నె ట్ లో హీటెక్కిస్తున్నాయి.

ఇది విక్కీ కౌశల్ 37వ పుట్టినరోజు సందర్భంగా కత్రినా కైఫ్ ప్లాన్. భ‌ర్త‌ విక్కీ కోసం కత్రినా అందమైన పుట్టినరోజు పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ర‌క‌ర‌కాల ఫోటోలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఒక‌ ఫోటోలో విక్కీ కెమెరా వైపు చూస్తూ న‌వ్వుతుండ‌గా, కత్రినా అతడి వీపుపై ముఖం ఆన్చి లాల‌న‌గా క‌నిపించింది. `హ్యాపీ విక్కీ డే` ..అంటూ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ పై కరీనా కపూర్, ప్రీతి జింటా స్పందించారు. రెడ్ హార్ట్ ఈమోజీలు, ఇంద్ర‌ధ‌న‌స్సు ఈమోజీల‌తో జంట‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ప్రీతి జింటా `హ్యాపీ బర్త్‌డే విక్కీ` అంటూ కేక్ , రెడ్ హార్ట్ ఎమోజీలు షేర్ రాశారు. ద‌ర్శ‌కురాలు జోయా అక్తర్ `హ్యాపీ బి విక్కీ అని వ్యాఖ్య‌ను జోడించ‌గా, విక్కీ సోదరుడు సన్నీ కౌషల్ `క్యూటీస్` అని అన్నారు. మినీ మాథుర్ `హ్యాపీ హ్యాపీ హ్యాపీ టు అవర్ విక్కీ` అని వ్యాఖ్యానించారు. విక్కీ తండ్రి షామ్ కౌశ‌ల్ కూడా ఈ జంట‌కు విషెస్ తెలిపారు. త‌న కొడుకు జీవితంలో తనకంటే ముందుకెళ్తున్న తీరును చూసి తండ్రిగా ఈ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని అని ఆనందం వ్య‌క్తం చేసారు షామ్ కౌశ‌ల్ (ఒక‌ప్ప‌టి న‌టుడు).

విక్కీ - కత్రినా 9 డిసెంబర్ 2021న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో వివాహం చేసుకున్నారు. విక్కీ ప్ర‌స్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఆస్వాధిస్తున్నాడు. ఇటీవ‌లే విక్కీ చావా చిత్రంతో పాన్ ఇండియా విజ‌యం అందుకున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్ఫూర్తిదాయకమైన జీవిత కథను తెర‌పై ఆవిష్క‌రించారు. త‌దుప‌రి విక్కీ సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్‌లో అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లతో కలిసి కనిపించబోతున్నాడు. మ‌రోవైపు క‌త్రిన బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ పెళ్లి త‌ర్వాతా న‌టిగా కెరీర్ ని ఆస్వాధిస్తోంది.