మరో బయోపిక్ లో ఛావా హీరో
ఛావా సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన ఎంతో అద్భుతంగా పండింది.
By: Tupaki Desk | 5 Jun 2025 11:04 AMభిన్న కథలు ఎంచుకుంటూ, ఎంతో బలమైన పాత్రలను పోషిస్తూ, ఆ పాత్రలకు తన నటనతో ప్రాణం పోసి మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ నటుల్లో ఇప్పుడు విక్కీ కౌశల్ కూడా ఒకరు. ఇప్పటికే విక్కీ కౌశల్ పలు సినిమాల్లో నటించాడు. గతేడాది ఛావా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటూ ఇతర భాషల ఆడియన్స్ ను కూడా మెప్పించాడు విక్కీ కౌశల్.
ఛావా సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన ఎంతో అద్భుతంగా పండింది. ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లను అందుకుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో విక్కీ కౌశల్ క్రేజ్, మార్కెట్ రెండూ బాగా పెరిగాయి.
ఛావా తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోగా అవతరించిన విక్కీ కౌశల్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు విక్కీ కౌశల్ మరో బయోపిక్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి మూవీ లవర్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న లెజండరీ డైరెక్టర్ గురుదత్ బయోపిక్ లో విక్కీ కౌశల్ నటించనున్నట్టు సమాచారం.
ప్యాసా, కాగజ్ కె పూల్, సైలాబ్ లాంటి ఎన్నో హిట్ సినిమాలతో గురుదత్ అందరినీ మెప్పించారు. ఇప్పుడాయన బయోపిక్ పై బాలీవుడ్ లో చర్చలు జరుగుతుండగా, అందులో టైటిల్ రోల్ లో విక్కీ కౌశల్ నటిస్తే బావుంటుందని అతణ్ణి సంప్రదించారని తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగి చర్చలు ఫలిస్తే గురుదత్ బయోపిక్ లో విక్కీ కౌశల్ నటిస్తాడు. అల్ట్రా మడియా సంస్థ రూపొందించనున్న ఈ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.