సాంగ్: మిరాయ్ వన్ మోర్ 'వైబ్'
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ మరోసారి సూపర్ హీరోగా ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 26 July 2025 11:21 AM ISTహనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ మరోసారి సూపర్ హీరోగా ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, సినిమా నుంచి విడుదలైన తొలి సింగిల్ ‘వైబ్ ఉంది’ సాంగ్ ఇప్పుడే యూత్‌ను అలరిస్తోంది.
ఈ ‘వైబ్ ఉంది’ సాంగ్‌కు గౌర హరి సంగీతమందించారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఫ్లూట్ మ్యూజిక్‌తో ప్రారంభమయ్యే ఈ పాట, మొదట విన్నపుడే నచ్చేలా, అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రీథమ్‌లో, మాస్ బీట్‌లో హై ఎనర్జీతో దూసుకెళ్లే ఈ సాంగ్‌ను చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. ప్రొడక్షన్ వాల్యూస్, సెట్ డిజైన్ చూస్తే హై రేంజ్‌లో ఉన్నట్లు భావన కలుగుతుంది.
తేజ సజ్జ ఈ పాటలో ఒక కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. పోనీటెయిల్ హెయిర్, కూల్ మాస్ అవుట్‌ఫిట్‌లో యూత్‌ని మెస్మరైజ్ చేస్తున్నారు. తన డ్యాన్స్ మూమెంట్స్ కూడా బాగా క్లిక్కయ్యాయి. చివర్లో వచ్చిన మాస్ అవుట్‌ఫిట్‌లో తేజ స్టెప్పులు థియేటర్స్‌లో హై వోల్టేజ్ వైబ్ తీసుకు వచ్చేలా ఉన్నాయి. యూత్ అందరూ ఈ లుక్‌పై సోషల్ మీడియాలో పొగడ్తలు కురిపిస్తున్నారు. తేజ సజ్జ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఇప్పుడు ఫుల్ మార్క్స్ వస్తున్నాయి.
పాటలో హీరోయిన్ రితికా నాయక్ గ్లామర్ అదనపు హైలైట్. ఆమె స్టైలిష్ లుక్స్, తేజతో కెమిస్ట్రీ సంగీత ప్రియులకు మరింత ఆనందాన్ని అందించాయి. ఈ జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. విజువల్స్‌కి స్పెషల్ ఎఫెక్ట్స్, కలర్స్ యాడ్ కావడంతో పాట మ్యూజికల్ గా కాకుండా, విజువల్‌గా కూడా హిట్ అనిపించేలా ఉంది.
మిరాయ్‌లో మానోజ్ మంచు విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీయ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 5న మిరాయ్ ఎనిమిది భాషల్లో విడుదల కాబోతుండటంతో, ఈ పాటతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా వీఎఫ్ఎక్స్, ఫాంటసీ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి టీజర్ తోనే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పాట విడుదలతో మిరాయ్ సినిమాకి పాజిటివ్ బజ్ ఇంకో మెట్టు ఎక్కింది. థియేటర్లలో ఈ పాట వస్తే పక్కా జోష్ ఫీల్ కలిగించనుంది. ఇక టీజర్, పాటతో ప్రమోషన్లు ఊపందుకోవడంతో, సెప్టెంబర్ 5న థియేటర్లలో మిరాయ్ ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి.
