Begin typing your search above and press return to search.

స్పెషల్ ఇంటర్వ్యూ: భైరవకోనకు మా ఫ్రెండ్ షిప్ బాగా హెల్ప్ అయింది

అయితే ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' అనే సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 12:32 PM GMT
స్పెషల్ ఇంటర్వ్యూ:  భైరవకోనకు మా ఫ్రెండ్ షిప్ బాగా హెల్ప్ అయింది
X

టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' 'డిస్కో రాజా' వంటి ఫిక్షనల్ మూవీస్ తో మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' అనే సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'. 'టైగర్' తర్వాత వీరి కలయికలో రాబోతున్న రెండో చిత్రమిది. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ సినిమాని రాజేశ్ దండు నిర్మించారు. ఇది ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విఐ ఆనంద్ తాజాగా 'తుపాకీ డాట్ కామ్' కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

చిన్నప్పటి నుంచే స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ సినిమాలు, ఏలియన్ మూవీస్, సూపర్ నేచురల్ సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రభావం తనపై ఎక్కువ ఉండేదని వీఐ ఆనంద్ తెలిపారు. ప్రతీ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండాలనే సెంటిమెంట్ ఏమీ లేదని, అనుకోకుండానే అలా కుదిరిందని చెప్పారు. స్ట్రెయిట్ స్క్రీన్ ప్లే కంటే, స్టోరీని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చెప్పడం తనకు ఇష్టమని తెలిపారు. సందీప్ కిషన్ కు తనకు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ 'ఊరి పేరు భైరవకోన' సినిమాకు బాగా హెల్ప్ అయిందన్నారు. ఆయన చెప్పిన మరిన్ని విశేషాల కోసం ఫుల్ ఇంటర్వ్యూ చూడండి.