Begin typing your search above and press return to search.

బేబీ వైష్ణవి.. అంత రిస్క్ అవసరమా?

బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ యాక్టర్ గా మారిపోయిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:19 AM GMT
బేబీ వైష్ణవి.. అంత రిస్క్ అవసరమా?
X

బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ యాక్టర్ గా మారిపోయిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. బేబీ మూవీ ఇంపాక్ట్ తో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ భావించారు. అయితే చెప్పుకోదగ్గ ఆఫర్స్ అయితే రాలేదు. మరల తన మొదటి సినిమా హీరో ఆనంద్ దేవరకొండకి జోడీగా మరో సినిమాకి ఒకే చెప్పింది.

కొన్ని సినిమాల కోసం ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. యాక్టింగ్ తో పాటు డాన్స్ టాలెంట్ కూడా ఉండటంతో ఇక టాలీవుడ్ లో వైష్ణవికి తిరుగులేదని అంచనా వేశారు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరువాత క్లారిటీ వచ్చింది.

అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవి ఒకే చెప్పిందనే మాట వినిపిస్తోంది. ముందుగా ఆమె ఒప్పుకోకపోయిన పూరి జగన్నాథ్ బేబీ దర్శకుడు సాయి రాజేష్ తో మాట్లాడి ఆమెని ఒప్పించారంట, ఇప్పుడు ఇదే టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేసిన బ్యూటీ వెంటనే ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

నటిగా వైష్ణవికి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉందని, ఇలాంటి సమయాలలో ఐటెం సాంగ్స్ కి దూరంగా ఉంటే బెటర్ అనే అభిమానులు సలహా ఇస్తున్నారు. తెలుగమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన ప్లాట్ ఫామ్ వైష్ణవికి దొరికిందని, కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయితే చూడాలని ఆమెని ఇష్టపడేవారు ఆకాంక్షిస్తున్నారు.

మరి పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు దృష్టిలో పడటం కూడా చాలా ముఖ్యం. ఎంతో మంది హీరోయిన్స్ కి పూరి కెరియర్ ఇచ్చాడు. ఇప్పుడు అతని సినిమాలో ఐటెం సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజ్ వస్తుంది కాబట్టి మంచి ఛాన్స్ అని ప్రోత్సహించే వారు కూడా ఉన్నారు. మరి ఈ ఐటెం సాంగ్ టాక్ ఎంత వరకు వాస్తవం అనేది వైష్ణవి క్లారిటీ ఇస్తేనే కాని పూర్తిగా కన్ఫర్మ్ కాదని చెప్పాలి.