Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ప్రభాస్‌ సినిమా మూడో స్థానం!

తాజాగా ఒక సర్వేలో ఇండియన్‌ సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌ ఎక్కువగా వినియోగించిన సినిమాల జాబితాలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా మూడో స్థానంలో నిలిచింది.

By:  Tupaki Desk   |   4 April 2025 12:00 AM IST
ఆ విషయంలో ప్రభాస్‌ సినిమా మూడో స్థానం!
X

ఒకప్పుడు హాలీవుడ్‌కే పరిమితం అయిన వీఎఫ్ఎక్స్‌ ఇండియన్‌ సినిమాల్లో కామన్‌ అయ్యాయి. వీఎఫ్ఎక్స్‌ను వినియోగించి ఇండియన్‌ ఫిల్మ్స్‌ మేకర్స్‌ అద్భుతాలను సృష్టిస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు, విజువల్‌ వండర్‌ను అందించాలనే ఉద్దేశంతో వీఎఫెక్స్‌ వర్క్‌పై ఎక్కువ డబ్బులు కేటాయిస్తూ ఉన్నారు. గడచిన పదేళ్ల కాలంలో వీఎఫ్ఎక్స్ వర్క్‌ వినియోగం అనేది భారీగా పెరిగింది. అదే స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు పెరుగుతూ వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఇండియాలోనూ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు భారీగా పెరిగాయి. తాజాగా ఒక సర్వేలో ఇండియన్‌ సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌ ఎక్కువగా వినియోగించిన సినిమాల జాబితాలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా మూడో స్థానంలో నిలిచింది.

ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్‌ ఆఫ్ కామర్స్ అండ్‌ ఇండస్ట్రీ (FICCI) వారు మీడియా, ఎంటర్‌టైనర్‌ రంగంపై 2025కి గాను రిపోర్ట్‌ను ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర వియాలను వెళ్లడించారు. ముఖ్యంగా సినిమా, టీవీ రంగంలో వీఎఫ్ఎక్స్ వర్క్‌ పెరిగిన తీరును అందులో పేర్కొన్నారు. ఇండియన్‌ సినిమా రంగంలో వీఎఫ్‌ఎక్స్‌ వినియోగం పదుల రెట్లు పెరిగినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు అత్యధికంగా 'ఫైటర్‌' సినిమాకు గాను వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ జరిగినట్లు తెలియజేశారు. 3500 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఫైటర్‌ కోసం వినియోగించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ చరిత్రలో ఇదే అత్యధికంగా చెబుతున్నారు.

ఫైటర్‌ తర్వాత హీరమండికీ అత్యధికంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. సదరు సంస్థ రిపోర్ట్‌ అనుసారం హీరంమండీ కి ఏకంగా 1200 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ వినియోగించారట. ఇచ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా కోసం దాదాపుగా 900లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను వినియోగించారట. సౌత్ సినిమాల్లో అత్యధికంగా కల్కి సినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్‌ను వినియోగించడం విశేషం. ఈమధ్య కాలంలో కల్కి సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ గురించి విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. వర్క్‌ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ ప్రభాస్ ను వీఎఫ్ఎక్స్ వర్క్‌లో క్రియేట్‌ చేశారని, ఆయన ఒరిజినిల్‌గా కనిపించింది కొద్దిగే అంటున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌ విషయంలో వస్తున్న విమర్శలపై చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హీరోను తక్కువ షూటింగ్‌లో చూపించడం కారణంగానే ఎక్కువ వీఎఫ్‌ఎక్స్ షాట్స్ పడి ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది ఆ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కే తెలియాలి. త్వరలోనే కల్కి 2 సినిమాను మొదలు పెట్టబోతున్నారు. 2027 వరకు సీక్వెల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనూ ప్రభాస్ సినిమా చేయాల్సి ఉంది.