‘షష్టిపూర్తి’ నుంచి మరో ఫీల్ గుడ్ సాంగ్.. ఎలా ఉందంటే..
కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఈ మధ్య పెద్దగా రాలేదు. అయితే అలాంటి సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న తెలుగు సినిమా ‘షష్టిపూర్తి’
By: Tupaki Desk | 18 May 2025 2:47 PM ISTకుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఈ మధ్య పెద్దగా రాలేదు. అయితే అలాంటి సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న తెలుగు సినిమా ‘షష్టిపూర్తి’. ప్రమోషన్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇక సినిమా సంగీతం ఇప్పటికే అభిమానులను ఆకర్షిస్తోంది, ముఖ్యంగా నాలుగో ట్రాక్‌గా విడుదలైన 'షష్టిపూర్తి వేయి వేణువులు' టైటిల్ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ పాట కుటుంబ విలువలను, ఆనంద సంబరాలను ప్రతిబింబించే వైబ్రంట్ నంబర్‌గా నిలిచింది. ఇప్పటికే మూడు చార్ట్‌బస్టర్ పాటలతో దూసుకెళ్తున్న ఈ ఆల్బమ్, టైటిల్ సాంగ్‌తో పూర్తి స్థాయి సంగీత పండుగగా మారిందని అభిమానులు అంటున్నారు. సంగీత దిగ్గజం ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. ఇక వేయి వేణువులు పాటను కృష్ణ చైతన్య రచించగా కార్తిక్ పాడారు.
ఇళయరాజా కంపోజిషన్స్ ఈ ఆల్బమ్‌కు అపురూపమైన విలువను జోడించాయి. ముఖ్యంగా ‘ఎదో ఎదో’ పాటకు ఎంఎం కీరవాణి రాసిన లిరిక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి, ఈ పాట చార్ట్స్‌లో టాప్‌లో నిలిచింది. ఇళయరాజా, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సంగీతం కుటుంబ కథనానికి బలమైన ఆధారంగా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు.
‘షష్టిపూర్తి’ సినిమా మంచి సామజిక విలువలు ఉన్న కథనంతో రూపొందుతోంది. రూపేష్, అకాంక్ష సింగ్ ఈ సినిమాలో ఫ్రెష్ ఆన్‌స్క్రీన్ జంటగా కనిపిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన మళ్లీ కలిసి నటించడం అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ నటీనటుల మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్ నడుస్తోంది.
సినిమా నిర్మాణ విలువలు మరో హైలైట్‌గా నిలుస్తున్నాయి. పవన్ ప్రభ డైరెక్షన్‌లో, మా ఆయి బ్యానర్‌పై రూపేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆకర్షణీయమైన విజువల్స్, రిఫైన్డ్ సెట్ డిజైన్‌తో లావిష్‌గా రూపొందుతోంది. యూత్‌ఫుల్ ఎనర్జీ, ఎమోషనల్ డెప్త్‌ను మిళితం చేస్తూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లోని కుటుంబ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మొత్తంగా, ‘షష్టిపూర్తి’ టైటిల్ సాంగ్ విడుదలతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇళయరాజా సంగీతం, కీరవాణి లిరిక్స్, రాజేంద్ర ప్రసాద్-అర్చన కాంబోతో ఈ సినిమా మే 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
