Begin typing your search above and press return to search.

హీరోతో మ‌న‌స్ప‌ర్థ‌ల‌పై స్టార్ డైరెక్ట‌ర్ క్లారిటీ

ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ ధ‌నుష్, కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ మ‌ధ్య విభేదాలున్నాయ‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లలొస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 July 2025 5:00 AM IST
హీరోతో మ‌న‌స్ప‌ర్థ‌ల‌పై స్టార్ డైరెక్ట‌ర్ క్లారిటీ
X

ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ ధ‌నుష్, కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ మ‌ధ్య విభేదాలున్నాయ‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లలొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై డైరెక్ట‌ర్ వెట్రిమారన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. వెట్రిమార‌న్ నెక్ట్స్ మూవీని శింబుతో చేస్తుండ‌ట‌మే ఈ ప్ర‌చారాల‌కు కార‌ణం. అయితే సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌చారాల్లో ఎలాంటి నిజం లేద‌ని వెట్రిమార‌న్ క్లారిటీ ఇచ్చారు.

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం త‌ననెంతో బాధించింద‌ని ఆయ‌న అన్నారు. వెట్రిమార‌న్ తాజాగా త‌న త‌ర్వాతి సినిమాను అనౌన్స్ చేస్తూ ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. సూర్య‌తో అనౌన్స్ చేసిన వాడి వాస‌ల్ సినిమా కొన్ని రీజ‌న్స్ వ‌ల్ల లేట‌వుతుంద‌ని, ఈ టైమ్ లోనే తాను శింబును క‌లిసి ఓ క‌థ చెప్ప‌గా, ఆ క‌థ న‌చ్చి వెంట‌నే శింబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిపారు.

ఈ సినిమా కూడా వ‌డ చెన్నై నేప‌థ్యంలోనే ఉండ‌నుంద‌ని, అలా అని ఈ సినిమా వ‌డ చెన్నైకు సీక్వెల్ కాద‌ని వెట్రిమార‌న్ చెప్పారు. వ‌డ చెన్నైకు సంబంధించిన అన్ని హ‌క్కులూ ధ‌నుష్ ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని, ఈ విష‌యంపై తాను ధ‌నుష్ తో డిస్క‌స్ చేశాన‌ని, శింబుతో సినిమా చేస్తున్నాన‌ని చెప్పగానే, ఆయ‌న ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని వెట్రిమార‌న్ అన్నారు.

దాని కోసం ధ‌నుష్ ఒక్క రూపాయి కూడా అడ‌గ‌కుండా ఎన్ఓసీ ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని, కానీ ఈ విష‌యాలేవీ తెలియ‌కుండా చాలా మంది త‌మ మ‌ధ్య గొడ‌వ‌లున్న‌ట్టు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని వెట్రిమార‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ధ‌నుష్ చాలా స‌మ‌యాల్లో త‌న‌కు అండ‌గా నిలిచార‌ని, త‌న ప‌నిలో ధ‌నుష్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేద‌ని, ఇంకా చెప్పాలంటే తాను రీసెంట్ గా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ధ‌నుషే అడ్వాన్స్ ఇచ్చి ఆదుకున్నార‌ని వెట్రిమార‌న్ వెల్ల‌డించారు. త‌మ మ‌ధ్యే కాదు, శింబు- ధ‌నుష్ మ‌ధ్య కూడా మంచి బాండింగ్ ఉంద‌ని, ఈ ప్రాజెక్టు విష‌యంలో వారిద్ద‌రూ ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ని వెట్రిమార‌న్ తెలిపారు.