Begin typing your search above and press return to search.

భ‌ర్త‌కు దూరంగా ఆమ‌ని కార‌ణ‌మ‌దేనా?

తనకు సినిమాలంటే ఇష్టమని- ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని అందుకే విడిపోవా లనుకున్నామని ఆమని తెలిపారు.

By:  Tupaki Desk   |   28 April 2024 2:30 PM GMT
భ‌ర్త‌కు దూరంగా ఆమ‌ని కార‌ణ‌మ‌దేనా?
X

వెట‌ర‌న్ న‌టి ఆమ‌ని గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అప్ప‌ట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అంద‌మైన న‌టి. ఎన్నో చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఫ్యామిలీ హీరోయిన్ ఎవ‌రు? అంటే అప్ప‌టి అభిమానుల‌కు వెంట‌నే త‌ట్టే పేరు ఆమ‌ని. అంత‌గా తెలుగు లోగిళ్ల‌లో పాపుల‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు. హీరోల‌కు మామ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. న‌టిగా బిజీగా ఉన్న స‌మ‌యంలో తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ దంప‌తుల‌కు కుమారుడు-కుమార్తె గ‌ల‌రు. అయితే వివాహం త‌ర్వాత సినిమాల‌కు దూర‌మయ్యారు. భ‌ర్త‌కు సినిమాల్లో న‌టించ‌డం ఇష్టం లేక ఆయ‌న మాట‌కు క‌ట్టుబ‌డి సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అయితే కొంత కాలంగా ఆమ‌ని మ‌ళ్లీ న‌టిగా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య కల‌త‌లు చోటు చేసుకున్న‌ట్లు త‌మిళ మీడియాలో వార్త‌లొచ్చాయి. అటుపై వారిద్ద‌రు వేర్వేరు గా ఉంటున్న‌ట్లు ఖార‌రైంది. తాజాగా ఈ విష‌యాల‌పై ఆమ‌ని తొలిసారి స్పందించారు.

తనకు సినిమాలంటే ఇష్టమని- ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని అందుకే విడిపోవా లనుకున్నామని ఆమని తెలిపారు. విడాకులు తీసుకోకపోయినా... అండర్ స్టాండింగ్ తో విడిపోయామ‌న్నారు. అలాగ‌ని మాట్లాడుకోలేనంత దూరం లేదు. ఇప్పటికీ టచ్ లోనే ఉన్నామని, అప్పుడప్పుడు కలుస్తుంటామన్నారు. పిల్లలిద్ద‌రు త‌న వ‌ద్దే ఉంటున్నార‌ని.. వాళ్లే తన ప్రపంచమ‌ని అన్నారు. సినిమాలు, షూటింగ్ ల వల్ల పిల్లలకు దూరంగా ఉండాల్సి వ‌స్తోంద‌న్నారు. ఆమని సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్ కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

1997 త‌ర్వాత ఆమ‌ని సినిమాలు చేయ‌డం మానేసారు. మ‌ళ్లీ 2004 లో కంబ్యాక్ అయ్యారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. `దేవ‌స్థానం` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టి నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. మ‌ద్య లో గ్యాప్ లున్నా అవ‌కాశాలు రాని కార‌ణంగా దూరం ఉండాల్సి వ‌చ్చింది. గ‌త రెండు..మూడేళ్ల‌గా ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నారు.