Begin typing your search above and press return to search.

స‌త్యరాజ్ కి మాతృవియోగం!

త‌మిళ న‌టుడు స‌త్య‌రాజ్ ఇంట విషాదం నెల‌కొంది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 9:57 AM GMT
స‌త్యరాజ్ కి మాతృవియోగం!
X

త‌మిళ న‌టుడు స‌త్య‌రాజ్ ఇంట విషాదం నెల‌కొంది. స‌త్య‌రాజ్ త‌ల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ (94) కన్నుమూశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్న నాదాంబాళ్.. వృద్ధాప్య కారణంగా క‌న్నుమూసారు. ఆ స‌మ‌యంలో స‌త్య‌రాజ్ హైద‌రాబాద్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ విష‌యం తెలియ‌గానే హుటాహుటిన కోయంబ‌త్తూర్ కి బ‌య‌ల్దేరి వెళ్లారు. నాదాంబాళ్ కాళింగరాయర్‌‌కు కొడుకు సత్యరాజ్‌తోపాటు కుమార్తెలు కల్పన- రూప గ‌ల‌రు. స‌త్య‌రాజ్ అనుబంధం త‌ల్లితో ఎంతో గొప్ప‌ది.

ఈ విష‌యాన్ని ఆయ‌న చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. తల్లి-కుమారుడు సెంటిమెంట్ స‌న్నివేశాల్లోనూ ఇదే డైలాగ్ ప‌లు సినిమాల్లో చెప్పారు. త‌ల్లి మ‌ర‌ణంతో తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఆమె మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నటులు కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, డైరెక్టర్ శీను రామస్వామి తదితరులు సంతాపం తెలిపారు. అలాగే స‌త్య‌రాజ్ కుమారుడు స‌త్య శివ‌రాజ్ కూడా కోలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. నాయ‌న‌మ్మ మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే ఆయ‌న వెంట‌నే సొంతూరికి బ‌య‌ల్దేరి వెళ్లారు.

స‌త్య‌రాజ్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ లో బిజీ న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోన్న న‌టుడాయ‌న‌. బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప పాత్ర‌తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. ఆ సినిమా స‌త్య‌రాజ్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే తండ్రి..అన్న‌య్య‌..త‌మ్ముడి పాత్ర‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసారు. స్టార్ హీరోల సినిమాల్లో సత్య‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వసంత్ రవితో కలిసి నటించిన 'వెపన్' సినిమా త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది.