Begin typing your search above and press return to search.

వేణు తొట్టేంపుడికి ఆ బిజినెస్ లు ఉన్నాయా..?

అయితే హీరోగా సినిమాలు మానేసిన వేణు 10, 15 ఏళ్ల దాకా ఏం చేశాడు అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో వీటికి క్లారిటీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 9:02 AM GMT
వేణు తొట్టేంపుడికి ఆ బిజినెస్ లు ఉన్నాయా..?
X

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ ఈ సినిమాలు అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు చూసినా సరే అందులో నటించిన వేణు చేసిన కామెడీ ఆయన డైలాగ్ డెలివరీ అన్నీ అలరిస్తాయి. హీరోగా చేసిన తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చేసిన వేణు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. ఈమధ్యనే రవితేజతో కలిసి రామరావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించాడు. ఆ సినిమా అంతగా కమర్షియల్ హిట్ అవలేదు కానీ వేణుని మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు.

ఇక లేటెస్ట్ గా అతిధి అంటూ ఒక హారర్ వెబ్ సీరీస్ తో కూడా వేణు ఎంటర్టైన్ చేశారు. అతిధి వెబ్ సీరీస్ లో వేణు వరకు తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సీరీస్ కూడా ఆయన కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. అయితే హీరోగా సినిమాలు మానేసిన వేణు 10, 15 ఏళ్ల దాకా ఏం చేశాడు అంటే రీసెంట్ ఇంటర్వ్యూలో వీటికి క్లారిటీ ఇచ్చాడు. తనకు చాలా బిజినెస్ లు ఉన్నాయని వాటిని చూసుకుంటూ ఉన్నానని అన్నారు. హీరో వేణు ముఖ్యంగా రోడ్ కాంట్రాక్టులు, డ్యాం లు నిర్మిస్తారని తెలుస్తుంది.

మన దగ్గర కన్నా ఉత్తరాఖండ్, అరుణాచల ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ఇలా దేశం మొత్తం లో తను చాలా రోడ్ వర్క్ చేస్తుంటానని. మళ్లీ ఇన్నాళ్లకు వరుస అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు నెలలో కొన్ని రోజులు సినిమాలకు కొన్ని రోజులు బిజినెస్ కోసం టైం కేటాయించాలని అనుకుంటున్నానని అన్నారు వేణు. అప్పుడప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ లో కనిపించడం గురించి ప్రస్తావిస్తూ తన బావ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు కోసం ప్రచారం లో పాల్గొంటానని అంతే తప్ప తనకు పాలిటిక్స్ లో వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారు వేణు.

ఒకప్పుడు హీరోగా చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన వేణు మళ్లీ ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసారి తనకు ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తానని ఇక మీదట ప్రయోగాలు చేసేందుకు కూడా రెడీ అని అంటున్నారు వేణు. ఆ క్రమంలోనే అతిధి చేశానని తను ఇదివరకు ఎప్పుడు ఇలాంటి జోనర్ చేయలేదని అతిధి అందుకే చాలా కొత్తగా అనిపించిందని అన్నారు వేణు. అవకాశం వస్తే విలన్ గా కూడా చేసేందుకు రెడీ అంటున్నారు వేణు. రాబోయే సినిమాల్లో తనని చాలా కొత్త పాత్రల్లో చూస్తారని అంటున్నారు.