Begin typing your search above and press return to search.

మిర్చి జోడిలా వెనుస్వామి జంట.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే!

వేణు స్వామి పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   31 March 2024 11:12 AM GMT
మిర్చి జోడిలా వెనుస్వామి జంట.. చూస్తే స్టన్ అవ్వాల్సిందే!
X

వేణు స్వామి పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యుట్యూబ్ ఛానల్స్ లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల జాతకాలు చెబుతూ ఉంటారు. ఈయన చెప్పిన జ్యోతీష్యంలో కొన్ని సందర్భాలలో నిజం అయ్యాయి. దాంతో వేణు స్వామి పేరు బాగా పాపులర్ అయ్యింది. అలాగే కొంతమంది హీరోయిన్స్ వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకున్నారు.

ఈ కారణంగా వేణుస్వామి సెలబ్రెటీ ఆస్ట్రాలాజిస్ట్ గా సోషల్ మీడియాలో విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. గతంలో ఆయన కొన్ని సినిమాలలో ఆలయ పూజారి పాత్రలలో కూడా కనిపించారు. అయితే సినిమాల ద్వారా రాని గుర్తింపు వేణుస్వామికి ఆస్ట్రాలజిస్ట్ గా వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జ్యోతీష్యం చెప్పారు. అది జరగలేదు. అయితే కవిత జైలుకి వెళ్తుందని చెప్పారు.

అది వాస్తవం అయ్యింది. ఇలా వేణు స్వామి అంచనాలలో కొన్ని నిజం అయ్యాయి. కొన్ని జరగనివి ఉన్నాయి. 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వేణు స్వామి చెప్పారు. దీనిని జగన్ అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా వేణుస్వామికి సంబందించిన ఒక షార్ట్ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణు స్వామి భార్య ప్రముఖ వీణ విద్వాంసురాలు వీణ శ్రీవాణి.

ఆమె పాపులర్ తెలుగు సినిమా సాంగ్స్ ని వీణపై వాయించడం ద్వారా సంగీతకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సినిమాలతో దగ్గర సంబంధం ఉంది. ఇద్దరు కలిసి మిర్చి సినిమాలో ప్రభాస్, అనుష్క మధ్య సాగే ఓ రొమాంటిక్ సన్నివేశానికి రీల్ లో పెర్ఫార్మ్ చేశారు. చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటూ వేణు స్వామి పలికిన డైలాగ్‌కు వీణా శ్రీవాణి చిలిపిగా కౌంటర్ ఇవ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఈ రీల్ లో వేణుస్వామి టీషర్ట్, కళ్ళజోడు ధరించి ఉండగా వీణా శ్రీవాణి అచ్చమైన బ్రాహ్మణ యువతి తరహాలో చీరకట్టు ఒంటిపై నిండుగా ఆభరణాలు వేసుకొని ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేణుస్వామిలో ఈ కళకూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.