Begin typing your search above and press return to search.

ఒకప్పటి హీరో.. ఇప్పుడు మరో రీ ఎంట్రీ!

వేణు తొట్టంపూడి.. ఈ పేరు ఎక్కడైనా విన్నట్టు ఉందా? ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు

By:  Tupaki Desk   |   22 Aug 2023 12:01 PM GMT
ఒకప్పటి హీరో.. ఇప్పుడు మరో రీ ఎంట్రీ!
X

వేణు తొట్టంపూడి.. ఈ పేరు ఎక్కడైనా విన్నట్టు ఉందా? ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, 90 జనరేషన్ వాళ్లకు తెలిసే ఉంటుంది.చిన్నప్పుడు ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ సినిమా చూడాలంటే అందరికీ వేణు సినిమాలు గుర్తుకు వచ్చేవి. ముఖ్యంగా హనుమాన్ జంక్షన్, స్వయం వరం, చిరు నవ్వు, పెళ్లాం ఊరెళితే వంటి సినిమాలతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు.


అయితే, సడెన్ గా ఆయన కనిపించకుండా వెళ్లిపోయారు. వేణు నుంచి సినిమాలు ఎందుకు రావడం లేదా అని అభిమానులు కంగారు పడ్డారు. మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఆయన సడెన్ గా సినిమాలు చేయడం ఆపేశారు. అలా ఎందుకు చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. కానీ, ఆయన మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

ఇటీవల రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఆయన, ఈ సారి ఫుల్ లెంగ్త్ రోల్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అయితే, ఈ సారి సినిమాలతో కాకుండా, ఆయన ఓ వెబ్ సిరీస్ తో అలరించాలని అనుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ లో ఆయన ప్రధాన పాత్రలో అదిథి అనే వెబ్ సిరీస్ లో ఆయన నటిస్తున్నారు.

గత కొంతకాలంగా డిస్నీ హాట్ స్టార్ ఒరిజినల్స్ పేరిట పలు వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు వారే ఈ అతిథి అనే వెబ్ సిరీస్ ని తీసుకువస్తున్నారు. అందులో వేణు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఆయన ఒంటి నిండా గాయాలు కనపడుతున్నాయి.

అందరు గెస్ట్ లను ఆహ్వానించలేం అనే క్యాప్షన్ ఇచ్చారు. స్టోరీ ఎలా ఉంటుంది? వేణుతో పాటు ఇంకా ఎవరెవరు ఈ సిరీస్ లో నటిస్తారు అనే విషయాలను ఇంకా ప్రకటించలేదు.మరి ఈ అతిథి కథ ఎలా ఉంటుందో? వేణు ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.