ఎల్లమ్మ ఛాలెంజ్ కి కీర్తి సంసిద్దమా..?
వేణు ఎల్లమ్మ సినిమా గురించి ప్రస్తుతం ఎలాంటి క్లూ లేకపోయినా సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
By: Tupaki Desk | 12 July 2025 10:00 AM ISTబలగం సినిమా తర్వాత వేణు యెల్దండి ఎల్లమ్మ కథ రాసుకున్నాడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే ఈ సినిమా రాబోతుందని తెలిసిందే. ఈ సినిమాకు వేణుకి కాస్త ఎక్కువ బడ్జెట్ ని కేటాయిస్తున్నాడట దిల్ రాజు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఎల్లమ్మ సినిమా దేవత కథతో వస్తుంది. ఐతే ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా కథానాయికగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధన్ తో పాటుగా ఎల్లమ్మ లో కూడా కీర్తి సురేష్ ఛాన్స్ అందుకుంది. ఐతే ఎల్లమ్మ సినిమాలో వేణు హీరోయిన్ పాత్రకు చాలా బలమైన సీన్స్ రాసుకున్నాడట. సినిమాలో హీరో పాత్రకి ఈక్వల్ గా పక్కాగా చెప్పాలంటే హీరోయిన్ రోలే టైటిల్ రోల్ అని తెలుస్తుంది. అమ్మవారి పూనుకున్నట్టుగా కొన్ని సీన్స్ ఉంటాయని.. వాటికి కీర్తి సురేష్ ఎలా చేస్తుందో అన్న ఎగ్జైట్మెంట్ ఉందట.
ఐతే ఎల్లమ్మ సినిమా కథ విన్నప్పుడే కీర్తి సురేష్ సూపర్ ఎగ్జైట్ అవ్వగా ఆ సినిమాలో ఛాలెంజింగ్ గా అనిపించిన సన్నివేశాలు అన్నిటినీ కూడా చేయడానికి మెంటల్ గా కీర్తి సురేష్ సిద్ధం అవుతుందట. మహానటితో మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ కి ఈసారి అంతకు మించిన రోల్ గా ఎల్లమ్మలో పడిందని తెలుస్తుంది. సో అలా చూస్తే ఎల్లమ్మతో కీర్తి సురేష్ కి మఓసారి అవార్డ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
వేణు ఎల్లమ్మ సినిమా గురించి ప్రస్తుతం ఎలాంటి క్లూ లేకపోయినా సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. నితిన్ తో తమ్ముడు సినిమా తో పెద్ద షాక్ తిన్న దిల్ రాజు ఎల్లమ్మ సినిమా మీద పూర్తి భారం పెట్టినట్టు తెలుస్తుంది. ఐతే వేణు స్క్రిప్ట్ మాత్రం అదిరిపోయిందని.. తప్పకుండా ఎల్లమ్మ గ్రాండ్ సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. నితిన్ కీర్తి సురేష్ ఆల్రెడీ రంగ్ దే సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐతే ఈసారి ఈ ఇద్దరు ఎల్లమ్మ కోసం కలిసి పనిచేస్తున్నారు. బలగం కాదు ఎల్లమ్మ లో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా వేరే లెవెల్ అన్నట్టు తెలుస్తుంది.
