ఎల్లమ్మ విషయంలో వేణు ప్లాన్ అదుర్స్..!
బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 6 Jun 2025 9:31 AM ISTబలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ చేస్తున్నాడు. బలగం సినిమాకు లిమిటెడ్ బడ్జెట్ మాత్రమే ఇచ్చిన దిల్ రాజు అండ్ టీం ఎల్లమ్మకు వేణు అడిగిన దాని కన్నా ఎక్కువే బడ్జెట్ ఇస్తున్నారని తెలుస్తుంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమా గురించి ఇండస్ట్రీలో మంచి ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే స్క్రిప్ట్ బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు.
నితిన్ ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎల్లమ్మ సినిమా గ్రామ దేవతకు సంబంధించిన కథగా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ టైం లో ఎవరు లీక్ చేయకుండా ఉండాలని వేణు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. సెట్ లో ఎవరు కూడా ఫోన్స్ వాడకుండా చేయాలని అనుకుంటున్నారట.
సాధారణంగా ఇలాంటి కండీషన్స్ రాజమౌళి సినిమాకు పెడతాడు. తన టీం అంతా షూటింగ్ కి వచ్చే ముందే సెల్ ఫోన్స్ సరెండర్ చేసి రావాలి. ఐతే వేణు కూడా ఎల్లమ్మ సినిమాకు అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. కష్టపడి తెరకెక్కించే సినిమా నుంచి కీలకమైన సీన్స్ సినిమాకు హైలెట్ అవుతాయనుకున్న సీన్స్ బయటకు వస్తే ఆ ఎఫెక్ట్ మూవీ రిజల్ట్ మీద పడుతుంది. అందుకే ఎల్లమ్మ యూనిట్ ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
నితిన్ కూడా ఎల్లమ్మ గురించి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో బాగా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు. ఆ సినిమాకు తన నుంచి ఎంత ఎఫర్ట్ పెడితే తనకు అంత పేరొస్తుందని అన్నాడు. నితిన్ తప్పకుండా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేస్తాడని అంటున్నారు. ఎల్లమ్మ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. బలగం హిట్ కొట్టాడు కాబట్టి తన నుంచి వస్తున్న ఈ ఎల్లమ్మ మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి. సో ఎల్లమ్మ మీద ఉన్న ఈ హైప్ ని వేణు ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది చూడాలి. నితిన్ కూడా తానొక స్టార్ అన్నట్టుగా కాకుండా కథలో పాత్రదారుడిగానే నటించాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.
