డైనోసర్స్ లా రచయితలు అంతరించిపోతారేమో!
థియేటర్ కు వచ్చి ప్రేక్షకుడు నవ్వుకునేలా చేయాలంటే అంతకు మించి ఇవ్వాలి. అలాంటి పాత్రలు కుదరాలి. అవన్నీ చక్కగా కుదరడం ఓ సవాల్.
By: Tupaki Desk | 11 May 2025 6:52 AMఓ సినిమా రూపొందంలాంటే? 24 శాఖలు సమన్వయంతోనే సాధ్యం. అసలు సినిమా మొదలవ్వాలంటే ముందు కథ కావాలి. అందుకు రచయిత కలం పడితే తప్ప సాద్యం కాదు. రచయిత ఇచ్చిన కథ మీదనే సినిమా భవితవ్యం ఆధారడి ఉంటుంది. అటుపై దర్శకుడు దాన్ని డాల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సరైన కథ కుదిరినప్పుడే మిగతా శాఖలకు సంబంధించిన వారంతా కూడా రంగంలోకి దిగుతారు.
వాళ్లకు పని దొరుకుతుంది. మంచి కథరాయాలన్నా...కామెడీ ట్రాక్ రాయాలన్నా సరైన రైటర్లతోనే సాధ్యం. అయితే అలాంటి రైటర్లకు సరైన గౌరవం లభించలేదని నటుడు కం కమెడియన్ వెన్నెల కిషోర్ అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం నవ్వించడం సవాల్ గా మారింది. ఇప్పుడు అన్ని వేదికలపైనా విపరీతమైన కంటెంట్ దొరుకుతుంది. రీల్స్ ఓపెన్ చేస్తే బోలెడన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి.
థియేటర్ కు వచ్చి ప్రేక్షకుడు నవ్వుకునేలా చేయాలంటే అంతకు మించి ఇవ్వాలి. అలాంటి పాత్రలు కుదరాలి. అవన్నీ చక్కగా కుదరడం ఓ సవాల్. ఇది జరగాలంటే రైటర్లను కాపాడుకోవాలి. ఓ దర్శకుడికి ఇచ్చే హోదా వాళ్లకి అందించాలి. కానీ మనం ఇప్పుడు రచయితల్ని కాపాడుకోలేకపోతున్నాం. డైనోసర్స్ లా వాళ్లు కూడా అంతరించిపోతున్నారేమో అనిపిస్తుంది. రచయితలు కొత్త ఆలోచనలతో వచ్చినప్పుడే కామోడీ పాత్రలు కూడా వినూత్నంగా ఉంటాయి.
లేదంటే తెరపై రెగ్యులర్ పాత్రలే కనిపిస్తాయి. అలాంటి పాత్రలొచ్చినప్పుడు నేను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటా. నా పాత్ర ద్వారా కథ ముందుకెళ్తుందంటే? నాకు గొప్ప సంతృప్తిగా అనిపిస్తుంది` అన్నారు. వెన్నెల కిషోర్ నటించిన `సింగిల్` చిత్రం ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.