Begin typing your search above and press return to search.

శివరాత్రికి అనౌన్స్ మెంట్.. ఫ్యాన్స్ బి రెడీ..!

అందుకే హిట్ డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తో సినిమా రెడీ చేస్తున్నాడు. వెంకటేష్ 76వ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Feb 2024 3:30 PM GMT
శివరాత్రికి అనౌన్స్ మెంట్.. ఫ్యాన్స్ బి రెడీ..!
X

విక్టరీ వెంకటేష్ సైంధవ్ ఇచ్చిన షాక్ వల్ల అర్జెంట్ గా ఒక హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. వెంకటేష్ హిట్లు ఫ్లాపుల విషయంలో అంత సీరియస్ గా తీసుకోడు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ లెక్కలను చూస్తుంటారు. ఒకపక్క సీనియర్ స్టార్స్ అంతా కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ హిట్ అందుకోగా ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగ తో హిట్ అందుకున్నాడు. వెంకటేష్ సైంధవ్ భారీ యాక్షన్ సినిమాగా వచ్చినా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

అందుకే హిట్ డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తో సినిమా రెడీ చేస్తున్నాడు. వెంకటేష్ 76వ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఆల్రెడీ F2, F3 సినిమాలతో హిట్లు అందుకున్న ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపుడి, వెంకటేష్ ఈసారి కామెడీతో పాటుగా ఎమోషన్ ని కూడా పండించేలా కథ రెడీ చేశారట.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ బేస్ మీద ఈ సినిమా కథ ఉంటుందట. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపుడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా శివరాత్రికి ముహూర్త కార్యక్రమాలు చేస్తారట. శివరాత్రికి పూజ చేసి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

ఈ సినిమాను మళ్లీ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేస్తారని టాక్. 2025 ఆల్రెడీ చిరు విశ్వంభర, నాగార్జున నెక్స్ట్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. వెంకటేష్ తో అనిల్ చేసే సినిమాను కూడా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ కె.ఎస్ బాబీ సినిమా కూడా దసరా మిస్ అయితే సంక్రాంతికే రిలీజ్ అనేస్తున్నారు. సో 2025 సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోల నలుగురి మధ్య ఫైట్ జరుగుతుందని చెప్పొచ్చు.

ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఉంటారు ఎవరు వెనక్కి తగ్గుతారు.. ఎవరు రిలీజ్ ముందుకు జరుపుకుంటారన్నది తెలుస్తుంది. అయితే దిల్ రాజు ఆల్రెడీ శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అంటూ సినిమా సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేశాడు. మరి వెంకటేష్ సినిమా కోసం ఆ సినిమాను ముందుకు తెస్తారా లేదా వెనక్కి తీసుకెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది.