Begin typing your search above and press return to search.

వెంకీ నాగ్ అలా ఎందుకు ట్రై చెయ్యట్లేదు..!

సీనియర్ హీరోలుగా తమ ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు చేస్తున్న వెంకటేష్ నాగార్జున కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2024 9:30 AM GMT
వెంకీ నాగ్ అలా ఎందుకు ట్రై చెయ్యట్లేదు..!
X

సీనియర్ స్టార్స్ లో డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వారి సినిమాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. నాగార్జున 100 సినిమాలకు దగ్గరగా ఉండగా వెంకటేష్ ఈమధ్యనే 75 సినిమాలను పూర్తి చేశాడు. ఈ ఇద్దరి హీరోలకు ఎవరికి వారికి సెపరేట్ ఇమేజ్ ఉంది. తన కామెడీ, సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ తో అదరగొట్టేస్తాడు విక్టరీ వెంకటేష్.

ఇక కింగ్ విషయానికి వస్తే అది ఇది అని కాదు సినిమా కోసం ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అనేస్తారు. అందుకే ఈ ఇద్దరి సినిమాలు ఎక్కువ ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. సీనియర్ హీరోలుగా తమ ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు చేస్తున్న వెంకటేష్ నాగార్జున కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ట్రెండ్ ని కొనసాగిస్తున్నాడు వెంకటేష్. ఇప్పటికే మహేష్, పవన్, రాం, వరుణ్ తేజ్ ఇలా ఎలాంటి ఇమేజ్ ఉన్న హీరోలతో అయినా ఆయన స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అనేస్తున్నారు.

నాగార్జున కూడా ఇప్పటికే మంచు విష్ణు, కార్తీ, నాని లాంటి వారితో కలిసి మల్టీస్టారర్స్ చేశాడు. అయితే తెలుగులో ఇమేజ్ తో ముడి పెట్టకుండా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర అయినా చేసే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని అభిమానులు కోరుతున్నారు. మంచి కథ దొరికితే వెంకటేష్ నాగార్జున ఇద్దరు కలిసి నటించడానికి నో చెప్పే ఛాన్స్ లేదు.

సీనియర్ హీరోలు కలిసి నటిస్తే ఆ హీరోల ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్ అన్నట్టే లెక్క. ఎలాగు నాగ్, వెంకీ మధ్య రిలేషన్ కూడా బాగుంది కాబట్టి. ఈ ఇద్దరితో ఒక మల్టీస్టారర్ చేస్తే కచ్చితంగా భారీగా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సోలోగా ఎవరి స్టామినా వారిది అయినా వెంకీ, నాగ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని అటు అక్కినేని ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి అది ఎప్పటికి కుదురుతుందో.. అసలు జరుగుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో చేస్తుండగా.. నాగార్జున నా సామిరంగ హిట్ తర్వాత మరో సూపర్ హిట్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.