Begin typing your search above and press return to search.

వెంకీ మామ సూపర్ ఎనర్జీ.. సూపర్ స్పీచ్..!

సంక్రాంతికి ఈ సినిమా మంచి ఎంటర్టైన్ అందిస్తుందని. తన సినిమాలను మహిళా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. వారు సినిమాకు వస్తే ఫ్యామిలీ మొత్తం వస్తుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 11:57 AM GMT
వెంకీ మామ సూపర్ ఎనర్జీ.. సూపర్ స్పీచ్..!
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా సైంధవ్. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రాంగ్ యూసేజ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా కాలేజ్ స్టూడెంట్స్ తో వెంకటేష్ సందడి చేశారు. ముందుగా వరల్డ్ కప్ లో టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఫైనల్ మ్యాచ్ ఒక్కటి మిస్సైనా మనమంతా వారికి సపోర్ట్ గా ఉండాలని అన్నారు. యూత్ అంతా వెంకటేష్ వరల్డ్ కప్ ప్రస్తావన తెచ్చేసరికి కేకలు వేశారు.

ఇక సైంధవ్ సినిమాలోని రాంగ్ యూసేజ్ సాంగ్ గురించి చెబుతూ ఈ సాంగ్ మొబైల్ ఫోన్ గురించి ఉంటుందని. దన్ని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయన్నది తెలిసేలా అద్భుతమైన లిరిక్స్ తో ఈ సాంగ్ ఉంటుందని అన్నారు. ఇక శైలేష్ కొలను ఈ సినిమాను బాగా తీశారని. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. మీరంతా తన సినిమాలు చూశారో లేదో కానీ మీ ముందు జనరేషన్ నా సినిమాలు చూశారని అన్నారు.

మీకు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే తెలుసు.. మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుసు.. నారప్ప తెలుసు.. మీరు కూడా ఎంజాయ్ చేసే సినిమాలు చేస్తున్నానని అన్నారు. సైంధవ్ రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని కచ్చితంగా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందిస్తుందని అన్నారు. సినిమాలో తనతో పాటు నటించిన వారంగా తమ బెస్ట్ ఇచ్చారని అన్నారు.

సంక్రాంతికి ఈ సినిమా మంచి ఎంటర్టైన్ అందిస్తుందని. తన సినిమాలను మహిళా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. వారు సినిమాకు వస్తే ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఇది 75వ సినిమా ఇది చేయడం సంతోషంగా ఉందని అన్నారు వెంకటేష్.

మొదట డిసెంబర్ లో రిలీజ్ అనుకున్న సైంధవ్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతికి సినిమాల ఫైట్ లో వెంకటేష్ సైంధవ్ కూడా చేరింది. ఈ సినిమాలో రుహాని శర్మ, శ్రద్ధ దాస్, ఆండ్రియా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య నటించారు. వెంకటేష్ చాలాకాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా చేశారు. కొన్నాళ్లుగా వెంకటేష్ నుంచి మంచి మాస్ సినిమా కోరుతున్న విక్టరీ ఫ్యాన్స్ కి ఈ సినిమా స్పెషల్ ట్రీట్ అందించనుంది.