Begin typing your search above and press return to search.

వెంకీ కుడుముల - నితిన్.. కాన్ మ్యాన్ ఎవరు?

ఇక ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలను కమిట్ అయ్యారు. అందులో వెంకీ కుడుముల ప్రాజెక్టు ఒకటి

By:  Tupaki Desk   |   23 Jan 2024 6:50 AM GMT
వెంకీ కుడుముల - నితిన్.. కాన్ మ్యాన్ ఎవరు?
X

లవర్ బాయ్ నితిన్ ఇటీవల 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. రిలీజ్ కు ముందు సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఫలితంగా నితిన్ కెరియర్ లో ఈ సినిమా మరో ప్లాప్ గా మిగిలింది.


ఇక ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలను కమిట్ అయ్యారు. అందులో వెంకీ కుడుముల ప్రాజెక్టు ఒకటి. గతంలో నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన 'భీష్మ' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుతుంది. ఈ సినిమా తర్వాత ఇప్పటిదాకా నితిన్ కి ఒక్క హిట్ కూడా పడలేదు. భీష్మ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో ఈ ప్రాజెక్టుపై అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు మొదలయ్యాయి.

#VNR Trio అనే వర్కింగ్ టైటిల్ తో ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించి నేడు ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. 'అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్' అంటూ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని జనవరి 26 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ అంతా రెడ్ కలర్ థీమ్ తో ఉండటం విశేషం.

ఓ ఎత్తైన బిల్డింగ్ పై డిఫరెంట్ గెటప్ తో హీరో నిలబడటం ఈ పోస్టర్లో గమనించవచ్చు. 'అడ్వెంచర్స్ ఎంటర్టైనర్ మీకోసం వస్తోంది' అనే క్యాప్షన్ కూడా జోడించారు. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతుందని అర్థమవుతోంది. సినిమాలో హీరో రకరకాల గెటప్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ కాస్త సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.

ఇక ఈ సినిమాలో నితిన్ సరసన మరోసారి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శ్రీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదే ఏడాది సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.