Begin typing your search above and press return to search.

నితిన్- వెంకీ క్రేజీ ప్రాజెక్ట్.. మూవీ టైటిల్ అదేనా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సరైన హిట్ దొరక్క సతమతమవుతున్నారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 7:49 AM GMT
నితిన్- వెంకీ క్రేజీ ప్రాజెక్ట్.. మూవీ టైటిల్ అదేనా?
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సరైన హిట్ దొరక్క సతమతమవుతున్నారు. ఇటీవల వక్కంతం వంశీతో కలిసి ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ గా వచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ కుర్ర హీరో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్నారు. భీష్మ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ప్రస్తుతం నితిన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో ఇప్పటికే భీష్మ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షంతో పాటు.. నితిన్ కెరీర్ లో సూపర్ హిట్టుగా నిలిచిందీ ఈ మూవీ. ఇప్పుడు వెంకీతోనే మరో సినిమా చేస్తున్నారు నితిన్. ఆ మూవీ ఫస్ట్ లుక్ రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్.

గిఫ్ట్స్ ఇచ్చే సీజన్ ముగిసింది. త్వరలో దోచుకునే సీజన్ మొదలు అవుతుందంటూ మేకర్స్ ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 26న ఉదయం 11.07 గంటలకు మోసగాడి ముఖాన్ని మీకు చూపిస్తామంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. నితిన్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చింది. అయితే టైటిల్ కూడా ఆరోజే రివీల్ చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాను ఓ రేంజ్ లో వెంకీ కుడుముల ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మూవీ టైటిల్ ను రాబిన్ హుడ్ గా మేకర్స్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాబిన్ హుడ్ తరహాలోనే... జనాల నుంచి సొమ్మును కాజేసే క్యారెక్టర్ లో హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

క్రేజీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే... ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ఇటీవలే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అయినా నితిన్ కు హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.