Begin typing your search above and press return to search.

వెంకీ, మహేష్ ఫ్యాన్స్.. ఈ గొడవేంటి బాబు

ఈ సోషల్ మీడియా అనేది బాగా వాడకంలోకి వచ్చాక సెలబ్రెటీలతో అభిమానుల మధ్య దూరం బాగా తగ్గింది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 8:10 AM GMT
వెంకీ, మహేష్ ఫ్యాన్స్.. ఈ గొడవేంటి బాబు
X

ఈ సోషల్ మీడియా అనేది బాగా వాడకంలోకి వచ్చాక సెలబ్రెటీలతో అభిమానుల మధ్య దూరం బాగా తగ్గింది. అభిమానులు సెలబ్రిటీలకు ఏం చెప్పాలనుకున్నా ఈ సోషల్ మీడియానే వినియోగిస్తారు. అటు సెలబ్రెటీలు కూడా ఏ విషయం అయినా ఫాన్స్ తో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి బాగా పెరిగిపోయాయి.

ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. నిన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా డిస్కషన్ పెట్టుకున్నారు. నిర్మాత నాగ వంశీని ఆహ్వానిస్తే దానికి హాజరై ఆడియో రూపంలో ప్రత్యక్షంగా వాళ్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకటి రెండు థియేటర్స్ ఉన్న సింగిల్ స్టేషన్లో 'గుంటూరు కారం' విడుదల గురించి ఆందోళన పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. వెంకటేష్ 'సైంధవ్' కోసం స్క్రీన్స్ బ్లాక్ చేస్తారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు.

దీనికి నాగవంశీ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ఎక్కడ సమస్యలు రాకుండా మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నామని, సొంత హీరో కాబట్టి సైంధవ్ కోసం సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్లానింగ్ కి తాను ఎలా అడ్డుపడగలనని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా కాబట్టి సహకరించమని ఎలా అడగాలని సమాధానం ఇచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ నాగ వంశీ ఆ ప్లోలో లో అన్న మాటలు సైంధవ్ ఏదో చిన్న సినిమా అని అర్థం వచ్చేలా ఉండడంతో ఒక్కసారిగా వెంకీ ఫ్యాన్స్ కి కోపం వచ్చేసింది.

దీంతో నాగ వంశీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా అంతటా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వెంకటేష్ ఫాన్స్ కు దీటుగా మహేష్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. నిజానికి నాగ వంశీ అన్న మాటలకు వెంకీ ఫ్యాన్స్ వివిధ కోణాల్లో అర్థాలను వెతకడంతో ఈ రచ్చ మొదలైంది.

జనవరి 8 తర్వాత థియేటర్ల కేటాయింపు గురించి క్లారిటీ వస్తుందని, అప్పటిదాకా అనవసరంగా టెన్షన్ పడొద్దు అని పదేపదే చెబుతున్నా అవే ప్రశ్నలు రిపీట్ కావడంతో నాగ వంశీ ఇచ్చిన సమాధానం కాస్త మిస్ ఫైర్ అయింది. దీంతో సోషల్ మీడియాలో వెంకీ, మహేష్ ఫ్యాన్స్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. మరి దీనిపై నాగ వంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.