Begin typing your search above and press return to search.

వెంక‌టేష్-చిరంజీవి సిద్దం..స్టోరీ ఉందా?

అటుపై మెగాస్టార్ మాట్లాడిన సంద‌ర్భంలోనూ త‌ప్ప‌కుండా సినిమా చేస్తామ‌న్నారు. 'ఇద్దరం క‌లిసి సినిమా చేయాల‌న్న‌ది త‌న కొరిక‌గా వెంక‌టేష్ బ‌య‌ట పెట్ట‌డంతో నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:52 AM GMT
వెంక‌టేష్-చిరంజీవి సిద్దం..స్టోరీ ఉందా?
X

మెగాస్టార్ చిరంజీవి- విక్ట‌రీ వెంక‌టేష్ ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసారా? స్టోరీ రెడీగా ఉంటే మ‌ల్టీస్టార‌ర్ షురూ చేసేస్తారా? అంటే అవున‌నే తెలుస్తోంది. నిన్న‌టి రోజును జ‌రిగిన 'వెంకీ 75 క‌లియుగ పాండ‌వులు-సైంధ‌వ్' ఈవెంట్ లో స్టార్ హీరోలిద్ద‌రు దీనిపై క్లారిటీ ఇచ్చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి అతిధిగా విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘంగా మాట్లాడిన అనంత‌రం వెంక‌టేష్ చివ‌ర్లో చిరంజీవితో త్వ‌ర‌లోనే సినిమా చేస్తాను' అనేసారు.

అటుపై మెగాస్టార్ మాట్లాడిన సంద‌ర్భంలోనూ త‌ప్ప‌కుండా సినిమా చేస్తామ‌న్నారు. 'ఇద్దరం క‌లిసి సినిమా చేయాల‌న్న‌ది త‌న కొరిక‌గా వెంక‌టేష్ బ‌య‌ట పెట్ట‌డంతో నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇది నా కొరిక కూడా. మంచి క‌థ కుదిరితే నా సోద‌రుడు వెంకీతో సినిమా చేయ‌డం అత్యంత ఆనంద‌క‌ర విషయం అవు తుంది. మా ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. త‌న కెరీర్ నే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా ఎంతో అందంగా నిర్మించుకున్నాడు.

సురేష్ బాబు లాంటి అన్న‌య్య ఉండ‌టంతోనే అది సాధ్య‌మైంద‌ని భావిస్తుంటా. సంపూర్ణ వ్య‌క్తిత్వానికి నిర్వ‌చ‌నం వెంక‌టేష్' అని చిరంజీవి అన్నారు. దీంతో ఇద్ద‌రు స్టార్ హీరోల నుంచి అభిమానుల‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్పుడు కావాల్సింద‌ల్లా ఇద్ద‌రి ఇమేజ్ కి త‌గ్గ మంచి స్టోరీ. ఆ స్టోరీ ఎవ‌రు తెచ్చినా చేయ‌డానికి స్టార్ లు ఇద్ద‌రు సిద్ద‌మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని ద‌శాబ్ధాలుగా ఇద్ద‌రు సినిమాల్లో కొన‌సాగుతున్నారు.

కానీ ఏనాడు ఇలా క‌లిసి న‌టించాలి? అన్న టాపిక్ రాలేదు. చిరంజీవి..వెంక‌టేష్ ఎంతో మంది స్టార్ల‌తో క‌లిసి ప‌నిచేసారు. కానీ ఆ ఇద్ద‌రు మాత్రం క‌ల‌వ‌లేదు. ఇక ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టికే టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు...మ‌ల్టీస్టార‌ర్ లు హ‌వా కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో చిరు-వెంక‌టేష్ 2024 లో క‌లిసి సినిమా చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.