Begin typing your search above and press return to search.

'బొబ్బిలి రాజా' సీక్వెల్ కి రెడీగా ఉన్న వెంకీ

ఎవ‌రి ద‌గ్గ‌రైనా సీక్వెల్ స్టోరీ ఉంటే వెంకీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 2:30 PM GMT
బొబ్బిలి రాజా సీక్వెల్ కి రెడీగా ఉన్న వెంకీ
X

విక్ట‌రీ వెంక‌టేష్ 'బొబ్బిలి రాజా' సీక్వెల్ చేయ‌డానికి సంసిద్దంగా ఉన్నారా? ఎవ‌రి ద‌గ్గ‌రైనా సీక్వెల్ స్టోరీ ఉంటే వెంకీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అవును ఈ వ్యాఖ్య‌లు నేరుగా వెంకీ నోట వ‌చ్చిన‌వే. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'బొబ్బిలిరాజా' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.

అందులో వెంక‌టేష్ కి జోడీగా దివ్య‌భార‌తి న‌టించింది. మ్యూజిక‌ల్ గానూ సినిమా అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఇళ‌య‌రాజా అందించిన పాట‌లు శ్రోత‌ల్ని ఎంగానో అల‌రించాయి. దీంతో అప్ప‌టి క్లాసిక్ హిట్ గా బొబ్బిలి రాజా నిలిచింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సరిగ్గా మూడు ద‌శాబ్ధా త‌ర్వాత వెంకటేష్ ముందుకు సైంధ‌వ్ టీజ‌ర్ రిలీజ్ లో భాగంగా మీ సినిమాల‌న్నింటిలో సీక్వెల్ చేయాలంటే? ఏ సినిమా చేస్తార‌ని ప్ర‌శ్నిస్తే ..మ‌రో ఆలోచ‌న లేకుండా...త‌డ‌బ‌కుండా బొబ్బిలి రాజా పేరు చెప్ప‌డం విశేషం.

ఆయ‌న కెరీర్ లో ఎన్నో విజ‌యాలున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 75 చిత్రాలు చేసారు. కానీ వాటిలో వేటికి ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండా 'బొబ్బిలి రాజా' మాత్ర‌మే సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం విశేషం. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి సీక్వెల్ చేయాల‌న్న కోరిక ఆయ‌న‌లో బ‌లంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. న‌వ‌త‌రం ర‌చ‌యిత‌ల‌కు ఇది మంచి అవ‌కాశం. వెంక‌టేష్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు 'బొబ్బిలి రాజా'కి సీక్వెల్ క‌థ సిద్దం చేసి వినిపించే అవ‌కాశం ఉంది.

స‌రైన స్టోరీల‌తో వెళ్తే ఆయ‌న కొత్త వాళ్ల‌ని కూడా ఎంక‌రేజ్ చేస్తారు. కొత్త త‌రహా క‌థ‌లు కావాల‌ని ఆరాట‌ప‌డే న‌ట్లుల్లో వెంక‌టేష్ ముందుంటారు. తండ్రి రామానాయుడిలా అవ‌కాశాలు ఇచ్చి ప్రోత్స‌హిస్తేనే ప్ర‌తిభా వంతులు బ‌య‌ట‌కు రాగ‌ల‌రని బ‌లంగా న‌మ్ముతారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సురేష్ బాబు కూడా చాలా కాలంగా కొత్త వాళ్లకి ఎక్కువ‌గా అవకాశాలు క‌ల్పిస్తున్నారు. మేకింగ్ ప‌రంగా వాళ్లు అయితే మ‌రింత అడ్వాన్స్ గా ఉంటార‌న్న‌ది ఆయ‌న న‌మ్మ‌కం.