Begin typing your search above and press return to search.

VenkyAnil3 షూటింగ్ ప్రారంభం - సెట్స్ లో 'యానిమల్' యాక్టర్!

ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకింగ్ వీడియోని బట్టి తెలుస్తోంది. 'జోగ్వా' అనే మరాఠీ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న ఉపేంద్ర

By:  Tupaki Desk   |   11 July 2024 7:37 AM GMT
VenkyAnil3 షూటింగ్ ప్రారంభం - సెట్స్ లో యానిమల్ యాక్టర్!
X

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా రానుంది. #VenkyAnil3 #SVC58 అనే వర్కింగ్ టైటిల్స్ తో ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ తాజాగా మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

'Venky Anil3' మూవీ షూటింగ్ ఓ ప్యాలెస్‌ సెట్ లో స్టార్ట్ అయినట్లు మేకింగ్ వీడియోని బట్టి తెలుస్తోంది. హీరోయిన్ తో సహా కొంతమంది ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్‌ని సూచిస్తూ సెట్‌లో భారీ తుపాకీలను మనం చూడవచ్చు. వెంకీ, అనిల్ రావిపూడి, దిల్ రాజులకు 'పొంగల్ ' సెంటిమెంట్ ఉంది. అందుకే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టాలని 'SVC 58' చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే 6 నెలల్లోనే సినిమాని పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సెట్స్ మీదకు వెళ్లినట్లు అర్థమవుతోంది.

అనిల్ రావిపూడి ఈసారి వెంకీతో యాక్షన్‌ నేపథ్యంలో ఓ అసాధారణమైన ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వంటి మూడు పాత్రల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రాబోతోంది. ఇందులో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కథానాయికల పాత్రలకు సంబంధించిన క్యారక్టర్ పోస్టర్లును మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకింగ్ వీడియోని బట్టి తెలుస్తోంది. 'జోగ్వా' అనే మరాఠీ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న ఉపేంద్ర.. 'యానిమల్' మూవీలో ఫ్రెడ్డీ పాత్రలో ఆకట్టుకున్నారు. 'వాటే విజన్.. వాటే థాట్' అంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. తమిళ నటుడు వీటీ గణేష్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ రచయితలుగా పని చేస్తున్న ఈ సినిమాకి వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి లక్ష్యంగా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.