Begin typing your search above and press return to search.

వెంకీ - అనిల్.. అతనికి లక్కీ ఛాన్స్!

భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 March 2024 5:34 AM GMT
వెంకీ - అనిల్.. అతనికి లక్కీ ఛాన్స్!
X

భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే లేదా జూన్ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకీతో అనిల్ రావిపూడి ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు.


దీంతో హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో దిల్ రాజు కూడా ఖర్చు విషయంలో వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ మూవీ కోసం క్యాస్టింగ్ అండ్ టెక్నీకల్ క్రూని ఎంపిక చేసే పనిలో ఉన్నారంట. ఈ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి భీమ్స్ కి అవకాశం ఇస్తున్నారంట.

గత ఏడాది మ్యాడ్, బలగం సినిమాలతో రెండు సూపర్ హిట్స్ అందుకున్న భీమ్స్ 2012లో నువ్వానేనా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు. ఆ సినిమాలో వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ సాంగ్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. బెంగాల్ టైగర్ సినిమాతో భీమ్స్ కి బ్రేక్ వచ్చింది. తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు పడలేదు. అయితే గ్యాప్ లేకుండా చిన్న, పెద్ద సినిమాలకి భీమ్స్ మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు.

రవితేజ ధమాకాకి మ్యూజిక్ అందించారు. రీసెంట్ గా రిలీజ్ అయినా రజాకార్ మూవీకి కూడా భీమ్స్ మంచి మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం భీమ్స్ చేతిలో తేజ్ గంజా శంకర్, బెల్లంకొండ టైసన్ నాయుడు. అడవి శేష్ డెకాయిట్ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకీ 76 మూవీ ఛాన్స్ అనూహ్యంగా భీమ్స్ చేతికి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ని భీమ్స్ రెడీ చేసి అనిల్ రావిపూడికి వినిపించాడంట.

అవి బాగా నచ్చడంతో భీమ్స్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద ప్రొడక్షన్ లో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ మూవీకి భీమ్స్ కి మ్యూజిక్ అందించే ఛాన్స్ రావడంతో కచ్చితంగా ఇది అతనికి పెద్ద బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ జాబితాలోకి భీమ్స్ చేరిపోయే అవకాశం ఉంది.