Begin typing your search above and press return to search.

వెంకీ - అనిల్.. ఈ టైటిల్ అసలు ఊహించలేదు

ఈ చిత్రానికి మేకర్స్.. డిఫరెంట్ టైటిల్ ను అనుకుంటున్నారట. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను మేకర్స్ తాజాగా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   28 Feb 2024 4:07 PM GMT
వెంకీ - అనిల్.. ఈ టైటిల్ అసలు ఊహించలేదు
X

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి తన ల్యాండ్ మార్క్ 75వ సినిమా సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత సైంధవ్ లో ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించారు వెంకీ మామ. అది ఫ్యాన్స్ కు సరిగ్గా ఎక్కకపోవడంతో మళ్లీ తన ఎంటర్టైన్మెంట్ జోన్ కు వచ్చేశారు.

అయితే వెంకటేష్‌ మెయిన్‌ స్ట్రెంగ్త్‌ కామెడీనే. ఆ జోనర్ లో తెరకెక్కిన ఎన్నో వెంకటేష్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే సైంధవ్ రిజల్ట్ ను పక్కన పెట్టి.. నెక్ట్స్ సినిమాను అదే జోనర్‌ లో ప్లాన్ చేస్తున్నారు వెంకీ మామ. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబోలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు వచ్చాయి. ఎఫ్ 2 సూపర్ హిట్ అవ్వగా.. ఎఫ్-3 మంచి హిట్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరు చేతులు కలపనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ టైటిల్ ను దిల్ రాజు ఇటీవల రిజిస్టర్ చేయించారట.

ఈ చిత్రానికి మేకర్స్.. డిఫరెంట్ టైటిల్ ను అనుకుంటున్నారట. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను మేకర్స్ తాజాగా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని టాక్.

ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి.. సినిమాలను జెట్ స్పీడ్ లో తెరకెక్కిస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవల బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి మూవీ తెరకెక్కించి హిట్ కొట్టారు. అయితే ఎఫ్-3 మూవీలో వెంకటేష్ ను సూపర్ గా ప్రజెంట్ చేశారు రావిపూడి. మరి ఈ సినిమాతో వెంకీకి అనిల్ రావిపూడి గట్టి కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.