Begin typing your search above and press return to search.

చిరంజీవి కథ.. వెంకీ ఏం చేస్తాడో..?

ఐతే మళ్లీ చిరుని ఇంప్రెస్ చేసేలా కథ చెప్పడం కుదరని పని. ఒకవేళ చిరంజీవి కోసం వెంకీ రాసుకున్న కథను మరో హీరోకి ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందా అన్నది చూడాలి.

By:  Tupaki Desk   |   24 Jun 2025 6:00 AM IST
చిరంజీవి కథ.. వెంకీ ఏం చేస్తాడో..?
X

మెగాస్టార్ చిరంజీవి స్టోరీ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 150 సినిమాల అనుభవం ఉన్న మెగాస్టార్ తను చేయబోయే సినిమా విషయంలో ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో పాటు తను కచ్చితంగా చేయాలని అనిపించే అంశాలు ఉంటేనే సినిమా చేస్తాడు. మెగాస్టార్ 150 సినిమా నుంచి ఆరు సినిమాలు చేశాడు. ప్రస్తుతం విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ తర్వాత మెగా 157 సినిమాగా అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉంది.

మెగాస్టార్ తో అనిల్ చేస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఐతే విశ్వంభర సినిమా ముందు వెంకీ కుడుములతో చిరంజీవి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. సెట్స్ మీదకు వెళ్తుందని అనుకున్న సినిమా ఎందుకో వర్క్ అవుట్ కాలేదని ఎవరి దారి వారు చూసుకున్నారు.

వెంకీ కుడుముల ఆ సినిమా వదిలేసి నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేశాడు. ఆ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా వాటిని అందుకోలేదు. ఆ సినిమా హిట్ పడితే చిరు సినిమా ఏదైనా ఛాన్స్ ఉండేది కానీ అది ఫ్లాప్ అవ్వడంతో ఇక మెగాస్టార్ సినిమా ఆశలు వదులుకున్నట్టే లెక్క. మెగాస్టార్ చిరంజీవి వెంకీ కుడుముల ఈ కాంబో సినిమా వస్తుందని అనుకున్న ఆడియన్స్ కి నిరాశ తప్పలేదు. స్వతహాగా మెగా అభిమాని అయిన వెంకీ కుడుముల చిరుతో సినిమా వచ్చినట్టే వచ్చి మిస్ అయినందుకు కాస్త నిరుత్సాహ పడ్డాడు.

ఐతే మళ్లీ చిరుని ఇంప్రెస్ చేసేలా కథ చెప్పడం కుదరని పని. ఒకవేళ చిరంజీవి కోసం వెంకీ రాసుకున్న కథను మరో హీరోకి ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందా అన్నది చూడాలి. మెగాస్టార్ కాదన్న కథతో వెంకీ ఏ హీరోని సంప్రదిస్తాడు.. ఆ కథ ఏ హీరో మెచ్చుతాడు అన్నది చూడాలి. ఛలో, భీష్మ తర్వాత తీసిన థర్డ్ మూవీ రాబిన్ హుడ్ ఫ్లాప్ అవ్వడంతో వెంకీకి ఛాన్స్ లు కష్టమే అనిపిస్తుంది. మరి వెంకీ నెక్స్ట్ ఛాన్స్ ఎవరితో ఉంటుంది.. ఆ సినిమా ఎవరు హీరోగా చేస్తాడన్నది చూడాలి. ఆ అవకాశం వచ్చేదాకా వెంకీ వెయిట్ చేయక తప్పదు.