Begin typing your search above and press return to search.

ఆ హీరోని చూసి ముఖం తిప్పుకుని వెళ్లార‌ట‌

గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన భీష్మ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో రాబిన్‌హుడ్ పై ముందు నుంచే భారీ అంచ‌నాలున్నాయి

By:  Tupaki Desk   |   26 March 2025 2:22 PM IST
ఆ హీరోని చూసి ముఖం తిప్పుకుని వెళ్లార‌ట‌
X

నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన భీష్మ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డంతో రాబిన్‌హుడ్ పై ముందు నుంచే భారీ అంచ‌నాలున్నాయి. దానికి త‌గ్గ‌ట్టే రాబిన్‌హుడ్ సాంగ్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఆడియ‌న్స్ ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

గ‌త కొన్ని సినిమాలుగా వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ రాబిన్‌హుడ్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా రాబిన్‌హుడ్ తో హిట్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవాల‌ని చూస్తున్నాడు నితిన్. దానికి తోడు సినిమా బాగా వ‌చ్చింద‌నే న‌మ్మ‌కంతో రాబిన్‌హుడ్ ను త‌న కెరీర్ లో ఎప్పుడూ లేనంత‌గా ర‌క‌ర‌కాలుగా ప్ర‌మోట్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే నితిన్, డైరెక్ట‌ర్ వెంకీ కుడ‌ముల మ‌ధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. నితిన్ త‌న‌కు దేవుడిచ్చి అన్న అంటూ వెంకీ ప‌లుసార్లు మీడియా ముఖంగా చెప్పాడు. త‌న ఫ్యామిలీ త‌ర్వాత త‌న‌కు అంత‌లా స‌పోర్ట్ చేసే వ్య‌క్తి నితినే అని వెంకీ ఎన్నోసార్లు అన్నాడు. అలాంటి వెంకీ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో నితిన్ ఫ్లాపుల గురించి మాట్లాడాడు.

నితిన్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన హీరోలంతా రూ.50 కోట్ల క్ల‌బ్ లోకి ఈజీగా వెళ్లిపోతే నితిన్ మాత్రం ఇంకా ఆ రేంజ్ కు వెళ్ల‌క‌పోవ‌డ‌మేంట‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు మ‌ధ్య‌లో ఆయ‌న చేసిన కొన్ని సినిమాలు స‌రిగ్గా వ‌ర్క‌వుట్ అవ‌క‌పోవ‌డం వ‌ల్లే నితిన్ ఇంకా ఆ స్థాయికి వెళ్ల‌లేద‌న్నాడు వెంకీ. ఆయ‌న కెరీర్ స్టార్టింగ్ లోనే సై, దిల్, జ‌యం లాంటి సినిమాల‌కు స్టార్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేసి ఎంతో పెద్ద స‌క్సెస్ చూశాడని, అలాంట‌త‌ను ఇప్పుడు కొత్త‌గా చూడాల్సిన స‌క్సెస్ ఏముంద‌ని వెంకీ చెప్పాడు.

ఒక సినిమా హిట్ అయితే త‌ర్వాతి రెండు సినిమాలు ఫ్లాప్ అవ‌డం జ‌రిగాయ‌ని, దాని వల్లే నితిన్ మార్కెట్ అనుకున్న స్థాయిలో పెర‌గ‌లేద‌ని చెప్పిన వెంకీ, నితిన్ కెరీర్లో జ‌రిగిన ఓ చేదు అనుభ‌వాన్ని కూడా వెల్ల‌డించాడు. నితిన్ కెరీర్ బాగా డ‌ల్ గా ఉన్న టైమ్ లో చాలామంది ఆయ‌న్ని క‌లిసేవారు కాద‌ట‌, ఆయ‌న్ను క‌లిస్తే సినిమాలు చేయమంటారేమో అనుకుని కొంతమంది ముఖం తిప్పుకునే వెళ్లిపోయేవార‌ట అని వెంకీ తెలిపాడు. నితిన్ గురించి వెంకీ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.