Begin typing your search above and press return to search.

వెంకీ కుడుములకి ఛాన్స్ ఇచ్చేది ఎవరు..?

ఛలో సినిమాతో డైరెక్టర్ గా తొలి సినిమానే సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల అతనిలో టాలెంట్ ఉన్నదనే విషయాన్ని గుర్తించేలా చేశాడు.

By:  Tupaki Desk   |   17 July 2025 9:15 AM IST
వెంకీ కుడుములకి ఛాన్స్ ఇచ్చేది ఎవరు..?
X

ఛలో సినిమాతో డైరెక్టర్ గా తొలి సినిమానే సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల అతనిలో టాలెంట్ ఉన్నదనే విషయాన్ని గుర్తించేలా చేశాడు. ఛలోతోనే కన్నడ భామ రష్మికను తెలుగు తెరకు పరిచయం చేశాడు వెంకీ. ఇక అమ్మడి కెరీర్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నెక్స్ట్ వెంకీ కుడుముల భీష్మా అంటూ మరో సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా రష్మికానే హీరోయిన్ గా చేసింది.

నితిన్, వెంకీ కాంబోలో వచ్చిన భీష్మ సక్సెస్ అయ్యింది. ఐతే వెంకీ కుడుముల థర్డ్ అటెంప్ట్ రాబిన్ హుడ్ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. సినిమా విషయంలో ఎవరు ఏమి చేయలేకపోయారు. రాబిన్ హుడ్ మీద నితిన్ కూడా చాలా హోప్స్ పెట్టుకోగా అది షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. భీష్మ కాంబో కదా కచ్చితంగా రిజల్ట్ ఈసారి ఆ సినిమాను మించి ఉంటుందని అనుకుంటే దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చింది.

రాబిన్ హుడ్ ముందు వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు రెడీ అయ్యాడు. చిరుకి కథ చెప్పగా ఆయన కూడా కాస్త పాజిటివ్ గానే స్పందించారట. కానీ వెంకీ ఫైనల్ డ్రాఫ్ట్ చిరుని డిజప్పాయింట్ చేయడంతో అతన్ని పక్కన పెట్టేశాడు. ఇక ఆ తర్వాత రాబిన్ హుడ్ చేసిన వెంకీ కుడుముల సినిమా హిట్టు పడితే మెగాస్టార్ దగ్గరకి మరోసారి వెళ్లే అవకాశం ఉండేది. సో ఇప్పుడు మెగా డోర్స్ క్లోజ్ అయినట్టే.

వెంకీ కుడుముల నెక్స్ట్ స్టోరీ రాసుకున్నా కూడా ఏ హీరో అతనికి ఛాన్స్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. నితిన్ తో హిట్టు పడినా కూడా మళ్లీ నితిన్ తోనే సినిమా చేసిన వెంకీ నితిన్ తో రాబిన్ హుడ్ ఫ్లాప్ తర్వాత ఎవరితో సినిమా ప్రయత్నిస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. తప్పకుండా వెంకీ నెక్స్ట్ సినిమాతో కంబ్యాక్ అవ్వాల్సిందే. ఛలో, భీష్మ సినిమాలతో అలరించిన డైరెక్టర్ వెంకీ 3వ సినిమా షాక్ ఇవ్వగా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో తన సత్తా చాటాల్సి ఉంది. మరి వెంకీ ఆ ప్రయత్నాలు చేస్తున్నాడా ఏ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు లాంటి విషయాలు త్వరలో తెలుస్తాయి.