తెలుగు హీరోలకు చిక్కని యంగ్ డైరెక్టర్!
`సన్ ఆఫ్ విశ్వనాథమ్` అనే టైటిల్‌ని ఈ మూవీ కోసం అనుకుంటున్నారు. ఇదే టైటిల్ దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
By: Tupaki Entertainment Desk | 12 Feb 2026 11:20 AM ISTటాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఏ హీరోని కదిలించినా ఇప్పుడు ఇదే మాట చెబుతున్న విషయం తెలిసిందే. తెలుగు క్రేజీ డైరెక్టర్లతో పాటు తమిళ స్టార్ డైరెక్టర్లతో మన హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయితే ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం తెలుగు హీరోలని పక్కన పెట్టి కోలీవుడ్ హీరోల వెంటపడుతున్నాడు. తెలుగు హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోవడం, ప్రయోగాత్మక కథలకు తెలుగు స్టార్లు అంత ఈజీగా ఓకే చెప్పకపోవడంతో యంగ్ డైరెక్టర్ తమిళ హీరోలని నమ్ముకుంటున్నాడు.
తనే వెంకీ అట్లూరి. తెలుగు హీరోలతో మూడు సినిమాలు చేసినా అందులో ఒక్క `తొలిప్రేమ`మాత్రమే హిట్ అనిపించుకోవడంతో తమిళ, మలయాళ స్టార్లని నమ్ముకోవడం మొదలు పెట్టాడు. ధనుష్‌తో చేసిన `సార్`, దుల్కర్ సల్మాన్‌తో చేసిన `లక్కీ భాస్కర్` బ్యాక్‌టు బ్యాక్ సక్సెస్ కావడంతో డైరెక్టర్‌గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో మరోసారి తమిళ హీరోనే నమ్ముకున్నాడు. వెంకీ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
`సన్ ఆఫ్ విశ్వనాథమ్` అనే టైటిల్‌ని ఈ మూవీ కోసం అనుకుంటున్నారు. ఇదే టైటిల్ దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు హీరోలని పక్కన పెట్టి తమిళ, మలయాళ స్టార్స్ వెంటపడుతూ వరుసగా సూపర్ హిట్‌లని దక్కించుకుంటున్న వెంకీ అట్లూరిపై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిసారించింది.
మరీ ముఖ్యంగా స్టార్ ప్రొడ్యూసర్లు తనతో కలిసి సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ క్రేజీ ప్రొడక్షన్ కంపనీ వెంకీ అట్లూరితో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేయడం మొదలు పెట్టినట్టు తెలిసింది. ఇందులో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మెటీరియలైజ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కారణం హీరో నాని వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉండటమే. ప్రస్తుతం నటిస్తున్న `ది ప్యారడైజ్` ఇంత వరకు పూర్తి కాలేదు.
ఇది పూర్తయితే గానీ సుజీత్‌తో అనుకున్న సినిమా పట్టాలెక్కదు. అది పూర్తయితే గాని వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌కు టైమ్ లభించని పరిస్థితి. సుజీత్ డైరెక్షన్‌లో నాని చేయనున్న మూవీని లండన్‌లో ఏప్రిల్ లో ప్రారంభించి జూన్ వరకు అక్కడే మేజర్ షెడ్యూల్‌ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తయితే అప్పుడ గానీ వెంకీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అది లేటయితే వెంకీ మరో హీరోతో వెళతాడా.. నాని కోసం వేచి చూస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
