Begin typing your search above and press return to search.

ఆ హిట్ మూవీకి సీక్వెల్ ను క‌న్ఫ‌ర్మ్ చేసిన డైరెక్ట‌ర్

ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ల‌క్కీ భాస్క‌ర్ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని, ఆ స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   6 July 2025 1:14 PM IST
ఆ హిట్ మూవీకి సీక్వెల్ ను క‌న్ఫ‌ర్మ్ చేసిన డైరెక్ట‌ర్
X

హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసిన వెంకీ అట్లూరి ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌కు రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. వ‌రుణ్ తేజ్ హీరోగా తొలి ప్రేమ సినిమాతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన వెంకీ మొద‌టి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను, రంగ్‌దే సినిమాల‌తో ఓ మోస్తరు ఫ‌లితాన్ని అందుకున్న వెంకీ, కోలీవుడ్ హీరో ధ‌నుష్ తో సార్ సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు.

సార్ సినిమా త‌ర్వాత మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ తో ల‌క్కీ భాస్క‌ర్ సినిమాను చేశారు వెంకీ అట్లూరి. 2024లో వ‌చ్చిన ల‌క్కీ భాస్క‌ర్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుని నిర్మాత‌ల‌కు లాభాల‌ను మిగిల్చింది. 80-90ల మ‌ధ్య కాలంలో తెర‌కెక్కిన ఈ సినిమా క‌థ‌ బొంబాయిలో ఉండే ఓ సాధార‌ణ బ్యాంక్ క్యాషియ‌ర్ చుట్టూ తిరుగుతుంది.

మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా క‌థ‌, స్క్రీన్ ప్లే ఆడియ‌న్స్ ను విప‌రీతంగా మెప్పించింది. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ల‌క్కీ భాస్క‌ర్ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని, ఆ స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ల‌క్కీ భాస్క‌ర్ కాకుండా దానికి ముందు ధ‌నుష్ తో చేసిన సార్ సినిమాకు మాత్రం ఎలాంటి సీక్వెల్ లేద‌ని వెంకీ అట్లూరి తెలిపారు.

కాగా ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ అగ్ర హీరో సూర్య తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సూర్య కెరీర్లో ఈ సినిమా 46వ మూవీగా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం సూర్య‌46 వ‌ర్క్స్ లో బిజీగా ఉన్న వెంకీ అట్లూరి ఈ సినిమా పూర్త‌య్యాక ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ ను చేసే అవ‌కాశ‌ముందని స్ప‌ష్టం చేశారు. దుల్క‌ర్ సల్మాన్ ఇప్పుడు ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వంలో ఆకాశంలో ఒక తార‌తో పాటూ కాంత అనే సినిమాలు చేస్తున్నారు.