సూర్య తర్వాత వెంకీ చూపు ఇంకా పైకేనా?
డైరెక్టర్ వెంకీ అట్లూరి కెరీర్ లైన్ చూస్తే ఒక క్లియర్ మార్పు కనిపిస్తుంది. మొదట్లో తొలిప్రేమతో వరుణ్ తేజ్, తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్ను, నితిన్‌తో రంగ్ దే లాంటి సినిమాలు చేశాడు.
By: M Prashanth | 14 Aug 2026 10:07 PM ISTడైరెక్టర్ వెంకీ అట్లూరి కెరీర్ లైన్ చూస్తే ఒక క్లియర్ మార్పు కనిపిస్తుంది. మొదట్లో తొలిప్రేమతో వరుణ్ తేజ్, తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్ను, నితిన్‌తో రంగ్ దే లాంటి సినిమాలు చేశాడు. అప్పట్లో టాలీవుడ్ యంగ్ హీరోలతో లవ్ స్టోరీలకే పరిమితమైన ఈ డైరెక్టర్, ఆ తర్వాత నుంచి తన హీరోల సెలెక్షన్ పూర్తిగా మార్చేశాడు. ప్రతీసారి కథల పరంగా అలాగే హీరోల సెలక్షన్ లలో కూడా లెవెల్ నీ పెంచుకుంటూ వెళుతున్నాడు.
ఒక విధంగా తెలుగు హీరోల నుంచి మెల్లగా పక్క భాషల స్టార్ల వైపు అడుగులు వేశాడు. ధనుష్‌తో చేసిన 'సార్' బైలింగ్వల్ మార్కెట్‌లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' చేశాడు. ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేసి థియేటర్లలోకి వచ్చాడు. ఇలా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్‌కు ఆయన హీరోల మార్కెట్ రీచ్ పెరుగుతూ వచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారీ యాక్షన్ లేదా మాస్ ఎలివేషన్లు లేకుండానే డిఫరెంట్ లాంగ్వేజ్ ఆడియన్స్‌ను మెప్పించే కథలను వెంకీ ఎంచుకుంటున్నాడు. 'లక్కీ భాస్కర్' ఫైనాన్షియల్ డ్రామాతో వేర్వేరు భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. అందుకే పెద్ద స్టార్ దొరికితే పాన్ ఇండియా సెన్సిబిలిటీస్ ఉన్న సబ్జెక్టును కూడా హ్యాండిల్ చేయగలడనే ఒక నమ్మకం వచ్చింది.
ఇక సూర్యతో చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈరోజే థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఎర్లీ రెస్పాన్స్ చూస్తే ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడే దీనిపై ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేం. మొదటి రోజు కలెక్షన్లతో పాటు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఈ ఫ్యామిలీ డ్రామా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఒకవేళ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్లు సాధిస్తే వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఒక్కో సినిమాతో వైడర్ మార్కెట్ ఉన్న స్టార్స్ వైపు వెళ్తున్న ఈ డైరెక్టర్, సూర్య తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే క్యూరియాసిటీ మొదలైంది.
మళ్లీ టాలీవుడ్ టాప్ లీగ్‌లోని హీరోతో చేస్తాడా లేక ఇంకా పెద్ద పాన్ ఇండియా రీచ్ ఉన్న స్టార్ వైపు వెళ్తాడా అనేది చూడాలి. వరుసగా ఇతర ఇండస్ట్రీలోనీ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ వెంకీ అట్లూరి తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు. తన బలం అయిన డ్రామాను నమ్ముకుంటూనే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. సూర్య సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యాక వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ చాలా కీలకం. దాంతో ఆయన కెరీర్ గ్రాఫ్ ఇప్పుడు ఏ రేంజ్‌కు చేరిందో క్లియర్ గా కనిపిస్తుంది.
