Begin typing your search above and press return to search.

వెంకీ స్క్రిప్ట్ వినే మొద‌టి హీరో అత‌నే!

అయితే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెంకీ అట్లూరి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:09 AM IST
వెంకీ స్క్రిప్ట్ వినే మొద‌టి హీరో అత‌నే!
X

న‌టుడిగా కెరీర్ ను మొద‌లుపెట్టిన వెంకీ అట్లూరి ఆ త‌ర్వాత రైట‌ర్ గా ప‌లు సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ హీరోగా తొలి ప్రేమ అనే సినిమాతో డైరెక్ట‌ర్ గా మారి మొద‌టి సినిమాతోనే మంచి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. తొలి ప్రేమ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను, రంగ్‌దే సినిమాల‌తో ఓ మోస్త‌రు హిట్లు అందుకున్నారు వెంకీ అట్లూరి.

ఆ త‌ర్వాత త‌మిళ హీరో ధ‌నుష్ తో చేసిన సార్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అంద‌రి చూపునీ త‌న వైపుకు తిప్పుకున్నారు. గ‌తేడాది దుల్క‌ర్ స‌ల్మాన్ తో చేసిన ల‌క్కీ భాస్క‌ర్ సినిమాతో గొప్ప మ‌నీ క్రైమ్ థ్రిల్ల‌ర్ ను అందించిన వెంకీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

సూర్య‌46 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ప్రేమ‌లు బ్యూటీ మ‌మిత బైజు హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెంకీ అట్లూరి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. తను రాసుకున్న క‌థ‌ల‌ను వెంకీ ఎప్పుడూ మొద‌టిగా హీరో నాగ చైత‌న్య‌కే చెప్తాన‌ని తెలిపారు.

నాగ చైత‌న్య‌కు క‌థ చెప్ప‌డం త‌న‌కు సెంటిమెంట్ లా అయింద‌ని వెంకీ చెప్ప‌గా, ఇంత మంచి బాండింగ్ ఉన్న మీ ఇద్ద‌రూ క‌లిసి సినిమా ఎందుకు చేయ‌లేద‌ని మీడియా అత‌న్ని ప్ర‌శ్నించింది. కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు, షెడ్యూల్ డిఫ‌రెన్సుల వ‌ల్ల తామిద్ద‌రం క‌లిసి సినిమా చేయ‌లేక‌పోయామ‌ని వెంకీ తెలిపారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిశాక ఫ్యూచ‌ర్ లో వీరి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విరూపాక్ష డైరెక్ట‌ర్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్టిక్ థ్రిల్ల‌ర్ ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైత‌న్య కెరీర్లో 24వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది.