Begin typing your search above and press return to search.

వెంక‌టేష్ రెండ‌వ కుమార్తె పెళ్లి రేపే

ఆ త‌ర్వాత పెళ్లి తేది విష‌యాలేవి మీడియాకి లీక్ అవ్వ‌లేదు. తాజాగా మార్చి 15న పెళ్లి తేదీగా నిశ్చ‌యిం చిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 March 2024 9:53 AM GMT
వెంక‌టేష్ రెండ‌వ కుమార్తె పెళ్లి రేపే
X

ద‌గ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయా? వెంక‌టేష్ రెండ‌వ కుమార్తె హ‌య‌వాహిని వివాహం తేదీ ఫిక్సైందా? అంటే అవున‌నే తెలుస్తోంది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో విజ‌య‌వాడ‌కు చెందిన వ్య‌క్తితో హ‌య వాహిని నిశ్చితార్దం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ వేడుక‌కు టాలీవుడ్ నుంచి చిరంజీవి..మ‌హేష్ కూడా హాజ‌ర‌య్యారు. ఆ వేడుక ఎంతో నిరాడంబ‌రంగా జ‌రిగింది. కుటుంబ స‌బ్యులు.. స‌న్నిహి తులు..స్నేహితుల స‌మ‌క్షంలో ఆవేడుక జ‌రిగింది.

ఆ త‌ర్వాత పెళ్లి తేది విష‌యాలేవి మీడియాకి లీక్ అవ్వ‌లేదు. తాజాగా మార్చి 15న పెళ్లి తేదీగా నిశ్చ‌యిం చిన‌ట్లు తెలుస్తోంది. అంటే రేపే వివాహం జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. హైద‌రాబాద్ లో ఈ వివాహం జ‌రుగుతుంది. అయితే ఈ విష‌యాలేవి ఇంత‌వ‌ర‌కూ మీడియాలో ఎక్క‌డా లీక్ కాలేదు. ఇప్ప‌టికే మెహందీ..సంగీత్ వంటి కార్య‌క్ర‌మాలు కూడా షురూ అయిన‌ట్లు తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలోనే అన్ని ర‌కాల ఏర్పాట్ల‌తో పెళ్లి వేడుక‌లు జ‌రుగుతున్నాయి.

ఇందులో కుటుంబ సభ్యులు.. స్నేహితులు..స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నారు. గట్టి భద్రత మధ్య వేడుక‌లు జ‌రుగుతున్నాయి. మీడియాకి ఆహ్వానం లేన‌ట్లు తెలుస్తోంది. వెంక‌టేష్ ఇంట పెళ్లి అంటే హ‌డావుడి ఉంటుంది. సెల‌బ్రిటీలు కూడా పెద్ద‌గా ఎవ‌రూ ఉండ‌రు. ఆ కుటుంబానికి బాగా కావాల్సిన వారు త‌ప్ప ఇంకెవ్వ‌రు క‌నిపించ‌రు. అలాగే మీడియాలో ఎలాంటి ప్ర‌చారం హ‌డావుడి కూడా ఉండ‌దు.

ఇలాంటి ప్ర‌చారాల‌కు ఆ కుటుంబం దూరంగా ఉంటుంది. పైగా కుమార్తెలు కూడా సినిమా రంగంలో లేక‌పోవ‌డంతో తొలి నుంచి ఈ ర‌క‌మైన ఆర్బాటాల‌కు దూరంగానే ఉన్నారు. పెద్ద కుమార్తె అశ్రిత వివాహం కూడా ఇంతే నిరాడంబ‌రంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. పెళ్లైన కొన్ని రోజుల‌కు ఆ ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో విష‌యం తెలిసింది. ఇక వెంక‌టేష్ కాబోయే రెండ‌వ అల్లుడు డాక్ట‌ర్ అని తెలుస్తోంది.