Begin typing your search above and press return to search.

వెంకీకి ఇలాంటి సినిమాలు సెట్‌ అవ్వవు!

సంక్రాంతి సందర్భంగా సైంధవ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ కు నిరాశే మిగిలింది. వెంకీ 75వ సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబర్చారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:04 AM GMT
వెంకీకి ఇలాంటి సినిమాలు సెట్‌ అవ్వవు!
X

సంక్రాంతి సందర్భంగా సైంధవ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ కు నిరాశే మిగిలింది. వెంకీ 75వ సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబర్చారు. కానీ సినిమా కు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు అని చెప్పాలి. హనుమాన్‌, గుంటూరు కారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా కూడా సంక్రాంతి సీజన్ ను సద్వినియోగం చేసుకుంది. కాని వెంకీ మామ మాత్రం తన సైంధవ్‌ సినిమాతో భారీ వసూళ్లు సాధించలేక పోయాడు. యాక్షన్‌ సన్నివేశాల డోసు మరీ ఎక్కువ అయ్యిందని కొందరు పెదవి విరిస్తే, వెంకీకి ఇలాంటి సినిమాలు సెట్‌ అవ్వవు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇప్పటికి కూడా మంచి పేరు, ఆధరణ, క్రేజ్ ఉన్న వెంకటేష్ ఆ తరహా సినిమాలు చేస్తే బాగుంటుందని మొదటి నుంచి కూడా ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు తగ్గట్టుగా కథలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు వెంకటేష్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంకటేష్ గత చిత్రాలు సైంధవ్‌ తో పాటు కొన్ని నిరాశ పరిచాయి. అవన్నీ కూడా వెంకీ నుంచి ఫ్యాన్స్‌ ఏం కోరుకుంటున్నారో ఆ వినోదాన్ని పంచడంలో విఫలం అయ్యాయి. అందుకే ఆ సినిమాలు తిరస్కరణకు గురి అయ్యాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం. వెంకటేష్ తన తదుపరి సినిమాల ఎంపిక సమయంలో అయినా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.