Begin typing your search above and press return to search.

వెంకీ 76.. ఇది విన్నారా?

మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 April 2024 3:44 AM GMT
వెంకీ 76.. ఇది విన్నారా?
X

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ 76 మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు మీడియం రేంజ్ బడ్జెట్ లో టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇక సినిమాలో వెంకటేష్ కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఖరారు అయ్యింది. మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో మాజీ పోలీస్ గా కనిపించనున్నట్లు ఇదివరకే ఎనౌన్స్ మెంట్ వీడియోలో క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, భార్య మధ్యలో వెంకీ గేమ్ హైలెట్ అవుతుందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా మల్టీ స్టారర్ గా ఉండబోతోందనే ప్రచారం నడిచింది. మూవీలో కీలక పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డని ఎంపిక చేశారంటూ టాక్ నడిచింది.

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంట. మూవీలో విక్టరీ వెంకటేష్ సోలో హీరోగానే కనిపించబోతున్నాడంట. సెకండ్ హీరో క్యారెక్టర్ లేదని తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ కూడా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్3 సినిమాలు వచ్చాయి. ఆ రెండు మల్టీ స్టారర్ గా తెరకెక్కి నిర్మాతకు మంచి లాభాలు అంధించాయి.

వెంకీ76 మూవీతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనే ప్లాన్ తో ఉన్నారు. ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయంట. ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఏ చిత్రంలో పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని తీసుకురాబోతున్నారు.

అలాగే ఇందులో విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందట. సొంతూరుకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ను కూడా హైలెట్ చేస్తారని టాక్ వస్తోంది. సంక్రాంతికి పక్కా హిట్ బొమ్మగా ఈ మూవీ కథని అనిల్ రావిపూడి సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ చివరిగా సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. ఇక అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో వెంకీ76 మూవీ కూడా కచ్చితంగా హిట్ బొమ్మగా మారుతుందని అంచనా వేస్తున్నారు. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే కాన్ఫిడెన్స్ చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరిలోయో మ్యూజిక్ అందించనున్నాడు.