Begin typing your search above and press return to search.

వెంకటేష్ నెక్స్ట్.. బిగ్ ట్విస్ట్..!

సంక్రాంతికి రిలీజైన నాలుగు సినిమాలో డైరెక్ట్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా సైంధవ్ మాత్రమే.

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:00 AM GMT
వెంకటేష్ నెక్స్ట్.. బిగ్ ట్విస్ట్..!
X

విక్టరీ వెంకటేష్ సినిమాల ప్లానింగ్ ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి రిస్క్ చేస్తుంటాడు. అయితే అలాంటి టైం లో కూడా ఎక్కువ సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఈ సంక్రాంతికి వెంకటేష్ చేసిన ప్రయత్నం మాత్రం దగ్గుబాటి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. సంక్రాంతికి వెంకటేష్ సినిమా అంటే ఇంకేంటి ఆడియన్స్ కి పండగే అనుకున్నారు కానీ వెంకీ ఈసారి యాక్షన్ మోడ్ తో వచ్చి ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమా విషయంలో వెంకటేష్ లెక్క తప్పింది. ఆడియన్స్ కి ఒక మంచి యాక్షన్ మూవీ అందిద్దామనుకున్న దగ్గుబాటి హీరో ప్లాన్ రివర్స్ కొట్టేసింది.

సంక్రాంతికి రిలీజైన నాలుగు సినిమాలో డైరెక్ట్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా సైంధవ్ మాత్రమే. సినిమా హిట్టైనా ఫ్లాపైనా ఫలితం మీద ఒకే విధంగా రెస్పాండ్ అయ్యే వెంకటేష్ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేనందుకు బాధపడకుండా తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. అయితే రెండు సినిమాల అనుభవం ఉన్న శైలేష్ కొలనుతో సినిమా చేసిన వెంకటేష్ మూడు సినిమాలు డైరెక్షన్.. నటుడిగా దాదాపు పదుల సంఖ్యలో సినిమాలు చేసిన తరుణ్ భాస్కర్ ని నమ్మలేకపోయాడు.

వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా అని చాలా రోజుల్గా డిస్కషన్ నడుస్తుంది. అయితే ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. తరుణ్ భాస్కర్ ని అడిగితే తన వల్లే సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. తనకే సెకండ్ హాఫ్ పై క్లారిటీ రాలేదని అంటున్నాడు. కానీ వెంకటేష్ కే తరుణ్ భాస్కర్ కథ మీద నమ్మకం కుదర్లేదని టాక్. అయితే శైలేష్ మీద బ్లైండ్ గా హోప్స్ పెట్టుకున్న వెంకటేష్ తరుణ్ భాస్కర్ ని నమ్మకపోవడం పై ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

సైంధవ్ రిజల్ట్ తో వెంకటేష్ ఆలోచనలో మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. తరుణ్ భాస్కర్ కి దాదాపు ఓకే చెప్పినట్టు టాక్. ఇక ఈ సినిమాతో పాటుగా త్రివిక్రం తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు వెంకటేష్. అయితే వెంకీ సినిమాలో నాని కూడా నటిస్తాడని చెబుతున్నారు. నాని వెంకటేష్ తో త్రివిక్రం మల్టీస్టారర్ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతుంది. మరి ఈ సినిమాల్లో ఏది వెంకటేష్ ముందు చేస్తాడన్నది చూడాలి. వెంకటేష్ మాత్రం మరోసారి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చేయాలని చూస్తున్నాడు. తరుణ్ భాస్కర్ ఎలాగు కామెడీ లో సూపర్ కాబట్టి అతనితోనే నెక్స్ట్ సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయి.