Begin typing your search above and press return to search.

దగ్గుబాటి పెళ్లి వేడుకలో మెగా చిన్నోడు!

ఈ వేడుకకు అతి కొద్దిమంది ప్రముఖులను మాత్రమే పిలవడం జరిగింది. హీరో వెంకటేష్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ హీరోలతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:49 AM GMT
దగ్గుబాటి పెళ్లి వేడుకలో మెగా చిన్నోడు!
X

దగ్గుపాటి వారి ఇంట్లో మరోసారి పెళ్లి హడావిడి మొదలైపోయింది. వెంకటేష్ చిన్న కూతురు హవ్య వాహిని పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విజయవాడకు చెందిన ఒక ఉన్నతమైన డాక్టర్ కుటుంబంలో ఆమె కోడలుగా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వారి ఎంగేజ్మెంట్ వేడుకను కూడా రీసెంట్గా నిర్వహించారు.


ఈ వేడుకకు అతి కొద్దిమంది ప్రముఖులను మాత్రమే పిలవడం జరిగింది. హీరో వెంకటేష్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ హీరోలతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన సోదరుడు సురేష్ బాబు ఇండస్ట్రీలోని బడా నిర్మాతల్లో ఒకరు. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకను విజయవాడలో నిర్వహించగా వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.


అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకల్లో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా వాడుతున్నాయి. వెంకటేష్ ఇంట్లో జరిగే అతి ముఖ్యమైన వేడుకలకు మహేష్ బాబు ప్రతిసారి అటెండ్ అవుతూ ఉంటారు. ఇక ఈసారి వెంకటేష్ చిన్న కూతురుని ఆశీర్వదించేందుకు ఆయన రావడం జరిగింది.


ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మహేష్ ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు అంటే వారి మధ్యలో ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే వెంకటేష్ తో మహేష్ బాబు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన విషయం తెలిసిందే. చిన్నోడు పెద్దోడు పాత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆ ఇద్దరు ఎంతో దగ్గరయ్యారు.


ఇక వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కూడా దగ్గుపాటి ఫ్యామిలీకి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా బిజీగా ఉన్నప్పటికీ కాస్త గ్యాప్ తీసుకొని ఎంగేజ్మెంట్ పాల్గొన్నారు. ఇక ఇక దగ్గుబాటి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు కూడా ఈ నిశ్చితార్థం వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక హీరో నాగచైతన్య రానా దగ్గుపాటి అతిధులందరిని కూడా రిసీవ్ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.