Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ఇంట్లో పెళ్లి సందడి

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ మూవీ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:14 AM GMT
స్టార్ హీరో ఇంట్లో పెళ్లి సందడి
X

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే వెంకటేష్ కి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తండ్రి వారసత్వంతో వీరు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు.

పెద్ద కూతురు ఒక యుట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూకింగ్ వ్లోగ్స్ చేస్తూ ఉంటుంది. అలాగే సొంతగా బిజినెస్ చేసుకుంటుంది. కొడుకు ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు. రెండో కూతురు కూడా సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు. ఇదిలా ఉంటే దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైందని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్ధం ఈ రోజు విజయవాడలో జరగనుందని తెలుస్తోంది.

ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ నిశ్చితార్ధం కోసం విజయవాడ వెళ్ళారని తెలుస్తోంది. విజయవాడ సిటీకి చెందిన ఓ డాక్టర్ తో ఆమె పెళ్లి నిశ్చయం అయ్యిందని సమాచారం. త్వరలో పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో కూతురు ఎంగేజ్మెంట్ గురించి ఇప్పటి వరకు బయటకి రాకపోవడం విశేషం అని చెప్పాలి.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. సినిమా లేని సమయంలో ఎక్కువగా బుక్స్ చదవడంతో పాటు ఇతర వ్యాపకాలలో బిజీగా ఉంటారు. అలాగే ఎక్కువ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు.

అందుకే తన కూతురు ఎంగేజ్మెంట్ విషయం కూడా పెద్దగా మీడియా దృష్టిలో పడలేదు. ఫైనల్ గా ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే ఈ విషయం బయటకొచ్చింది. నిశ్చితార్ధ వేడుక పెద్ద ఆర్బాటం లేకుండా చేసుకుంటున్నారు కాబట్టి పెళ్లి గ్రాండ్ గా చేసే అవకాశం ఉండొచ్చు. మరి ఎప్పుడు డిసైడ్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.