Begin typing your search above and press return to search.

సైంధవ్.. అంత బడ్జెట్ అంటే రిస్కే..

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకుంది. వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది

By:  Tupaki Desk   |   29 Sep 2023 12:30 PM GMT
సైంధవ్.. అంత బడ్జెట్ అంటే రిస్కే..
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ సైంధవ్. భారీ బడ్జెట్ తో కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం సిద్ధమవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. రుహని శర్మ, ఆండ్రియా ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడు. తమిళ్ స్టార్ ఆర్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో ఆకట్టుకుంది. వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. హిట్ సిరీస్ లో రెండు సక్సెస్ లతో జోరుమీదున్న శైలేష్ కొలను పాన్ ఇండియా రేంజ్ లో 70 కోట్ల బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ ని సైంధవ్ తో హ్యాండిల్ చేస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్ కూడా ఈ చిత్రంతో తన మార్కెట్ రేంజ్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కానుంది. అలాగే షారుఖ్ ఖాన్ డుంకీ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ రెండు సినిమాలతో పోటీ పడటం అంటే రిస్క్ అనే చెప్పాలి.

అలాగే బడ్జెట్ పరంగా కూడా సైంధవ్ కి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. వెంకటేష్ మీద ఈ బడ్జెట్ అంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నప్పుడు కాస్తా సేఫ్ జోన్ లో రిలీజ్ చేస్తే ఉత్తమం అని నిర్మాత వెంకట్ బోయనపల్లి, దర్శకుడు శైలేష్ కొలను ఆలోచించారంట. అందుకే డిసెంబర్ లో అనుకున్న సైంధవ్ సినిమాని రిలీజ్ జనవరిలో సంక్రాంతికి పొడిగించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అవుతోంది. అలాగే హనుమాన్, రవితేజ ఈగల్, నా సామి రంగా చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. వీటిలో గుంటూరు కారం, ఈగల్ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. హనుమాన్ కూడా రిలీజ్ కన్ఫర్మ్ అయిపొయింది. అలాగే నా సామి రంగా సంక్రాంతి అని చెప్పి స్పీడ్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే హనుమాన్ లేదా ఈగల్ తప్పుకుంటే సైంధవ్ సంక్రాంతి డేట్ ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నరు. అయితే ఈ రెండు డేట్స్ లో రిలీజ్ ఎప్పుడైనా గట్టి పోటీ ఖాయం. ఈ విషయంలో దర్శక, నిర్మాతలు రిస్క్ చేస్తారా లేదా వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.