Begin typing your search above and press return to search.

విక్ట‌రీ కోసం ఇద్ద‌ర్ని సెట్ చేస్తున్నాడా?

అందులోనూ మ‌రోసారి అదే మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2024 4:30 PM GMT
విక్ట‌రీ కోసం ఇద్ద‌ర్ని సెట్ చేస్తున్నాడా?
X

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. `ఎఫ్ -2..ఎఫ్-3` విజ‌యాల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో రాబోతున్న మ‌రో సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి. ఈసారి ఏకంగా వెంకీతో సోలోగానే ప్లాన్ చేయ‌డంతో? ఇద్ద‌రు మ‌రింత గొప్ప‌గా వినోదం పంచ‌డానికి ఆస్కారం ఉంది. వెంకీ లో కామెడీ టైమింగ్..టింజ్ కి అనీల్ తోడైతే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహ‌కి కూడా అంద‌దు. అందులోనూ మ‌రోసారి అదే మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా లో వెంక‌టేష్ కి జోడీగా ఇద్ద‌రు హీరోయిన్ల‌ను అనుకుంటున్నారుట‌. ఒక హీరోయిన్ గా సీనియ‌ర్ భామ‌ని తీసుకుని ..మ‌రో భామ‌గా కొత్త నాయిక‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నారుట‌. అనీల్ సినిమాలో హీరోయిన్లు అంటే వాళ్ల పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. హీరోల‌కు పోటీగా హీరోయిన్ పాత్ర‌ల్ని రాయ‌గ‌ల ద‌ర్శ‌కుడు అనీల్. మ‌రి ఆ ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికి వ‌రిస్తుంది? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్ పనులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకు న్నాయి. దీంతో అనీల్ మిగ‌తా ప‌నుల్లోనే బిజీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వేస‌విలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని ప్రేక్షుల ముందుకు తీసుకురావాల‌న్నది ప్లాన్ గా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే వెంక‌టేష్ ల్యాండ్ మార్క్ చిత్రంగా రిలీజ్ అయిన `సైంధ‌వ్` ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే.

హిట్ ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ని న‌మ్మి అవ‌కాశం ఇస్తే అభిమానుల్ని తీవ్ర నిరూత్సాహ‌ప‌రిచాడు. సోలోగా వెంకీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాడ‌ని అభిమానులు ఆశించారు గానీ ప‌న‌వ్వ‌లేదు. చాలా కాలం త‌ర్వాత చేసిన సీరియ‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పై అంతా పెద‌వి విరిచేసారు. దీంతో వెంక‌టేష్ కూడా మ‌ళ్లీ రిస్క్ ఎందుకని సేఫ్ జోన్ గా అనీల్ ని తెర‌పైకి తెచ్చారు.