Begin typing your search above and press return to search.

వెంకీ లైనప్ లో మెగాస్టార్ మాత్రమే కాదు.. మరో అగ్ర హీరో కూడా..

వెంకటేష్ తన లైనప్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని చెప్పాడు.

By:  Tupaki Desk   |   7 July 2025 3:00 PM IST
వెంకీ లైనప్ లో మెగాస్టార్ మాత్రమే కాదు.. మరో అగ్ర హీరో కూడా..
X

టాలీవుడ్‌లో వెంకటేష్ వేగంగా సినిమాలు ఫినిష్ చేయగలరు అనే మంచి పేరుంది. కానీ ఈమధ్య సెలక్షన్ విషయంలో మునుపటి కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ మామ, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. కానీ తాజాగా అమెరికాలో జరిగిన నాట్స్ 2025 ఈవెంట్‌లో పాల్గొన్న వెంకటేష్, తన రాబోయే సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌కి మళ్లీ జోష్ వచ్చేసింది.

వెంకటేష్ తన లైనప్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని చెప్పాడు. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు. ఇక దర్శకుడిగా వెంకీతో ఇదే తొలి సినిమా. అందుకే ఈ కాంబోపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా షూటింగ్ డేట్ చెప్పకపోయినా, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.

అలాగే చిరంజీవి హీరోగా చేస్తున్న మెగా 157 సినిమాలో చిన్న క్యామియో చేస్తానని వెంకటేష్ చెప్పారు. అది ఫన్నీ క్యారెక్టర్ అని, ఆ సీన్ ఆడియెన్స్‌ని నవ్విస్తుందని తెలిపారు. అంతే కాకుండా, మీనాతో కలిసి దృశ్యం 3 కూడా చేస్తున్నానని అన్నారు. ఈ ఫ్రాంచైజ్‌కి మంచి ఫాలోయింగ్ ఉండటంతో, దాన్ని కొనసాగించాలనే ప్లాన్ ఉన్నట్టు స్పష్టం చేశారు.

ఇంకా ‘సంక్రాంతికి వస్తున్నాం’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మళ్లీ సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు. పరోక్షంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనేదే అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిపోయి ఉండే అవకాశం ఉంది. చివరగా వెంకటేష్ చెప్పిన విషయమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అదేంటంటే.. మాస్ హీరో బాలకృష్ణ తో కూడా ఓ భారీ సినిమా చేయబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. ఈ కామెంట్ విన్న వెంటనే బాలయ్య ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి వెంకటేష్ లైనప్‌లో చిన్న సినిమాలు ఏవీ లేవు. అన్నీ బడా డైరెక్టర్స్, బడా హీరోలతో కలిసి చేసే ప్రాజెక్టులే. గ్యాప్ వచ్చినా సరే, ఇప్పుడు వెంకటేష్ ఫుల్ స్పీడ్ మీద సినిమాలు చేయబోతున్నారన్న విషయంపై అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.