విక్టరీ కోసం ముగ్గురు భామలు దిగుతున్నారా?
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 July 2025 10:00 PM ISTవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. `వెంకటరమణ` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. `ఆనంద నిలయం` అన్నది ఉప శిర్షీక గా తెరపైకి వచ్చింది. దీన్నీ బట్టి ఇదీ పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. గతంలో వెంకటేష్ నటించిన సినిమాలకు త్రివి క్రమ్ రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరీ` లాంటి సినిమాలకు రచన త్రివిక్రమ్ అందించారు.
ఈ నేపథ్యంలో అదే తరహాలో వెంకటరమణ కథ ఉంటుందని అంచనాలు తెరపైకి వచ్చాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు వినిపిస్తోంది. మెయిన్ లీడ్ కోసం త్రిషను తీసుకుంటున్నారు. సెకెండ్.. ..థర్డ్ లీడ్ పాత్రలకు రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్ ను ఎంపిక చేస్తున్నట్లు వినిపిస్తుంది. గురూజీ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత బాగానే ఉంటుంది. కేవలం హీరోని బేస్ చేసుకునే తీయరు. అదీ వెంకీతో అంటే హీరోయిన్ల పాత్రలకు మరింత ప్రాముఖ్య తప్పన సరి.
దీంతో వెంకీ మరోసారి ముగ్గురు భామల ముద్దుల ప్రియుడిగా తె రపైకి కనిపించనున్నారని తెలుస్తోంది. త్రిష ఇప్పటికే వెంకటేష్ తో కలిసి మూడు సినిమాల్లో నటించింది. `ఆడవారి మాటలకు అర్దాలే వేరులే`, `నమో వెంకటేశ`, `బాడీగార్డ్` లోనూ నటించింది. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. మూడు చిత్రాల్లోనూ కామెడీ కామన్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో గురూజీ అదే సెంటి మెంట్ ని ఫాలో అవుతూ ఓ పాత్రకు త్రిషను లాక్ చేసినట్లు కనిపిస్తుంది.
ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 157వ చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఆ పాత్ర కు సంబంధించిన షూటింగ్ ఆగస్టులో పు పూర్తవుతుంది. అనంతరం వెంకీ కొత్త చిత్రం ప్రారంభిస్తారు. ఇప్పటికే వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో 300 కోట్ల క్లబ్ లో కి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తదుపరి సినిమా వసూళ్లు అంతకు మించి ఉంటాయని అంచనాలున్నాయి. గురూజీ ఆ రేంజ్ కంటెంట్ తో వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
