Begin typing your search above and press return to search.

వెంకటేష్ కోసం గురూజీ అదిరిపోయే టైటిల్..!

ఐతే ఇప్పుడు డైరెక్టర్ గా కూడా త్రివిక్రం వెంకటేష్ కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రేక్షకులకు అందించనున్నారు.

By:  Tupaki Desk   |   4 July 2025 9:34 PM IST
వెంకటేష్ కోసం గురూజీ అదిరిపోయే టైటిల్..!
X

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ ఏమి లేదు కానీ మిగతా విషయాలన్నీ కూడా చక చకా జరిగిపోతున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం ఆల్రెడీ స్టోరీ రాసేయడం మిగతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశాడని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ ని కూడా లాక్ చేశారని తెలుస్తుంది.

ఈ సినిమాకు వెంకట రమణ అనే టైటిల్ ని అనుకుంటున్నారట. వెంకట రమణ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా కేరాఫ్ ఆనంద నిలయం అని ఫిక్స్ చేశారట. త్రివిక్రం రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో సినిమాలు చేశాడు. ఐతే అతను డైరెక్టర్ గా మారిన తర్వాత మాత్రం ఎందుకో కలిసి పనిచేసే ఛాన్స్ తీసుకోలేదు. ఫైనల్ గా ఈ ఇద్దరు కలిసి పనిచేసే రోజు వచ్చింది.

వెంకా టైమింగ్ కి త్రివిక్రం డైలాగ్స్ ప్రేక్షకులను ఆల్రెడీ నవ్వించాయి. ఐతే ఇప్పుడు డైరెక్టర్ గా కూడా త్రివిక్రం వెంకటేష్ కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రేక్షకులకు అందించనున్నారు. వెంకటేష్ ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుని ఉన్నాడు. తప్పకుండా గురూజీ తో చేస్తున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

వెంకటేష్ త్రివిక్రం కాంబో అనగానే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాకు టైటిల్ గా వెంకట రమణ అని పెట్టడం చూస్తే ఇది మరో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తరహాలో సెన్సేషనల్ హిట్ సాధించే అవకాశం ఉంది. వెంకటేష్ తో త్రివిక్రం కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటైల్స్ రావాల్సి ఉంది. ఈ సినిమాను త్వరలో మొదలు పెట్టి 2026 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఐతే ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు.

వెంకటేష్ 77వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్రివిక్రం సినిమాల తరహాలోనే ఉంటూ ఈ కాంబినేషన్ స్పెషాలిటీ తెలిపేలా ఎంటర్టైన్మెంట్ డబుల్ అనే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. త్రివిక్రం ఈ సినిమా తర్వాతనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది.