ఆగస్టులో వెంకటేష్ ముహూర్తం పెట్టేసారా?
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 11:26 AM ISTవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. గురూజీతో ప్రాజెక్ట్ విష యంలో కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవ్వడంతో ఉంటుందా? ఉండదా? అన్న దానిపై క్లారిటీ లొపిం చింది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసినట్లు వినిపిస్తుంది.
ఆగస్టులో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా హీరోయిన్ ఎంపికపై టీమ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొంత మంది బాలీవుడ్ భామల పేర్లు పరిశీలిస్తున్నారుట. వాళ్లతో పాటు సౌత్ బ్యూటీలు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ నటించిన సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.
'మల్లీ శ్వరీ', 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలకు గురూజీ రైటర్ గా పనిచేసారు. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ గా వెంకీని డైరెక్ట్ చేయడంతో? అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇద్దరి కాంబినేష్ లో మంచి ఫ్యామిలీ కమ్ కామెడీ ఎంటర్ టైనర్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. గతలో ఇదే జానర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో కొత కథతోనో... యాక్షన్ కంటెంట్ తోనే అద్భుతాలు చేయడం కంటే ఇద్దరికీ కలిసొచ్చిన పాయింట్ నే కథా వవుస్తుగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
అందుకు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వెంకీతో గురూజీ నేల విడిచి సాము చేసే అవకాశాలు చాలా తక్కువే. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా అనూహ్య వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
