Begin typing your search above and press return to search.

ప‌రుగులు పెడుతోన్న ఆద‌ర్శ కుటుంబం!

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47` తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   23 March 2026 1:05 PM IST
ప‌రుగులు పెడుతోన్న ఆద‌ర్శ కుటుంబం!
X

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47` తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. షూట్ మొద‌లైన నాటి నుంచి ఎలాంటి బ్రేక్ ఇవ్వ‌కుండా నిర్విరామంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. దీంతో టాకీ కూడా వేగంగానే పూర్త‌య్యేలా క‌నిపిప్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో వెంక‌టేష్ తో పాటు ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా జాయిన్ అవుతున్నారు. ఈ యాక్షన్ స‌న్నివేశం ప్ర‌ధమా ర్ధానికి హైలైట్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. సాధార‌ ణంగా గురూజీ సినిమాలంటే? అవస‌రాన్ని బ‌ట్టి యాక్ష‌న్ సీన్స్ ఉంటాయి. అందులోనూ వెంక‌టేష్ లాంటి ఫ్యామిలీ స్టార్ తో యాక్ష‌న్ సీన్స్ అంటే వెరీ రేర్ అనే చెప్పాలి.ప్ర‌ధ‌మార్దంలోనే యాక్ష‌న్ స‌న్నివేశానికి ప్రాధాన్య‌త ఇచ్చారంటే? అది కీల‌క‌మైన బ్లాక్ అయ్యే ఉంటుంది.అలాగే సెకండ్ హాఫ్‌లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం.

త్రివిక్రమ్ తన మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, ఈసారి వెంకీ మామను ఓ పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించబోతున్నారు. మే నెల కల్లా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ , పాటల చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉంది. జూన్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే వెంకటేష్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ తన 78వ సినిమాను ప్రారంభించబోతున్నారు.

అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్ చిత్రం. ఇందులో వెంట‌కేష్ తో పాటు నంద‌మ‌యూరి హీరో క‌ల్యాణ్ రామ్ కూడా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ నెలలో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తు న్నారు. ఈ సినిమా రిలీజ్ ను అనిల్ రావిపూడి ముందే ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనేప‌థ్యంలోనే స‌మ‌యం వృద్దా కాకుండా జూన్ నుంచి నిరంతరాయంగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. అటు త్రివిక్రమ్ సినిమా క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో వేసవి తర్వాత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంటే? ఇటు అనిల్ రావిపూడి సినిమా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా `ఆదర్శ కుటుంబం` పరుగు , అనిల్ రావిపూడి ఈస్పీడ్ వెంకటేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపు తున్నాయి. ఈ రెండు సినిమాలు వెంకటేష్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.