మరోసారి సంక్రాంతికి టార్గెట్ చేస్తున్న వెంకీ?
ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 10:30 AMటాలీవుడ్ సెన్సిబుల్ హీరో ఎవరంటే అందరూ ముందుగా చెప్పే పేరు సీనియర్ హీరో వెంకటేష్‌దే. వెంకటేష్ రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటారు. ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా అసలు హీరోలానే ప్రవర్తించకుండా ఎంతో కూల్ గా ఉండే వెంకీకి అందరూ ఫ్యాన్సే. ఆయనకు యాంటీ ఫ్యాన్స్ అసలు ఉండరు.
ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ సినిమాతో ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ ను కూడా వెంకీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. దీంతో వెంకటేష్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నాడని అందరిలో ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్- వెంకీ కాంబినేషన్ లో రానున్న సినిమా గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది.
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి వచ్చి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ, తర్వాతి సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మంచి సీజన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని, ఎలాగైనా తర్వాతి సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని వెంకీ డిసైడయ్యాడట.
ఆల్రెడీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్ సినిమాలొచ్చాయి. ఆ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ వర్క్ చేసింది డైరెక్టర్ గా కాదు. రైటర్ గా. త్రివిక్రమ్ డైరెక్టర్ అయినప్పటి నుంచి వెంకటేష్ తో వర్క్ చేసింది లేదు. ఇన్నేళ్లకు వీరి కలయికలో సినిమా రానుండటంతో ఇప్పటికే ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.