ఆయనతో అదిరిపోయే సినిమా చేస్తా
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకోవాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి.
By: Tupaki Desk | 12 May 2025 8:30 AMప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా సినిమా గురించి ఆడియన్స్ మాట్లాడుకోవాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి. అలాంటిది ఇండస్ట్రీలో ఏదైనా మల్టీస్టారర్ వస్తుందంటే దానికి అన్నింటికంటే ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కు కాస్త మంచి కంటెంట్ తోడైతే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం.
అలనాటి కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి దేవుడు చేసిన మనుషులు చేశారు. ఆ తర్వాత కృష్ణ- శోభన్ బాబు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన స్టార్లు మల్టీస్టారర్ సినిమాలు కాస్త తక్కువే చేశారు. 2013లో వెంకటేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మహేష్ బాబుతో కలిసి చేసి ఈ మల్టీస్టారర్ ట్రెండ్ ను మొదలుపెట్టాడు.
ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న వెంకీ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల చేశాడు. ఆ తర్వాత కూడా వెంకీ పలువురితో కలిసి మల్టీస్టారర్లు చేశాడు. ఇప్పుడు త్వరలో వెంకీ ఓ యంగ్ హీరోతో కలిసి సినిమా చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆ యంగ్ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. రీసెంట్ గా సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు వెంకటేష్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.
సింగిల్ సినిమా ప్రమోషన్స్ లో శ్రీ విష్ణు ఓ ఇంటర్వ్యూలో వెంకీతో తాను తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. రామ్ అబ్బరాజు మైత్రీ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కథను రెడీ చేస్తున్నాడని, ఫస్టాఫ్ ఆల్రెడీ అయిపోయిందని, కథ పూర్తయ్యాక ఆయన్ని అప్రోచ్ అవుతామని, ఆయనకు కథ చెప్తే తప్పకుండా సినిమా చేస్తారనే నమ్మకం తనకుందని, అన్నీ కుదిరితే ఆ సినిమాను వెంకీతో చేస్తానని, ఒకవేళ ఆ సినిమా కాకపోయినా మరో సినిమా అయినా చేస్తానని, ఒక ఫ్యాన్ గా ఆయన్ని ఎలా చూడాలో తనకు బాగా తెలుసని, తమ కాంబోలో వచ్చే సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని శ్రీవిష్ణు వెల్లడించాడు.