Begin typing your search above and press return to search.

ఆయ‌న మాట‌ను ఇప్ప‌టికీ ఫాలో అవుతున్నా

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌వాళ్లు ఎవ‌రైనా స‌రే మీడియా అటెన్ష‌న్ ఎక్కువ‌గా కోరుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   30 April 2025 1:53 PM IST
Venkatesh Shares Why He Avoids Publicity Inspired by Rajinikanth
X

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌వాళ్లు ఎవ‌రైనా స‌రే మీడియా అటెన్ష‌న్ ఎక్కువ‌గా కోరుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా అంద‌రికీ తెలియాల‌ని, వారి గురించి జ‌నం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాల‌ని, నిరంతరం వార్త‌ల్లో నిలవాల‌నే కోరిక‌తో త‌మ గురించి తామే ప‌బ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు చాలా మంది.

కానీ ద‌గ్గుబాటి హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మాత్రం అలా కాదు. ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో చాలా కూల్ గా, కామ్ గా ఉంటారనే విష‌యం తెలిసిందే. అంతేకాదు, ప‌బ్లిసిటీ పై ఆయ‌న‌క‌స‌లు ధ్యాసే ఉండ‌దు. ఎప్పుడూ కావాల‌ని వార్త‌ల్లో ఉండాల‌నుకునే ర‌కం కాదు వెంకీ. రీసెంట్ గా తాను ప‌బ్లిసిటీని ఎందుకు ప‌ట్టించుకోడ‌నేది ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు వెంకీ.

తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇచ్చిన స‌ల‌హా వ‌ల్లే తాను ప‌బ్లిసిటీ గురించి అస‌లు ఆలోచించ‌న‌ని ఆయ‌న చెప్పాడు. ర‌జ‌నీకాంత్‌కు, త‌న‌కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ‌ని, ఆయ‌న్నుంచి తానెన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని తెలిపాడు వెంకీ. కెరీర్ స్టార్టింగ్ లో ర‌జినీ ఇచ్చిన స‌ల‌హానే తాను ఇప్ప‌టికీ పాటిస్తున్నాన‌ని వెంకీ చెప్పాడు.

తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేట‌ప్ప‌టికీ ర‌జినీ హీరో అయ్యార‌ని, త‌న తండ్రి రామానాయుడుతో క‌లిసి ర‌జినీ వ‌ర్క్ చేశార‌ని చెప్పాడు వెంకీ. తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు ర‌జినీ త‌న‌తో ఓ మాట చెప్పాడ‌ని, మూవీ రిలీజ్ టైమ్ లో బ్యాన‌ర్లు క‌ట్టారా? మ‌న పోస్ట‌ర్లు ఫ్రంట్ పేజ్ లో వ‌చ్చాయా లేదా లాంటి విష‌యాల‌ను ఆలోచించొద్ద‌ని, మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ వెళ్తే చాల‌ని ర‌జినీ అన్నార‌ని వెంకీ తెలిపాడు.

ర‌జినీ అప్పుడు చెప్పిన మాట‌నే తాను ఇప్ప‌టికీ ఫాలో అవుతున్నాన‌ని, అందుకే ప‌బ్లిసిటీ గురించి పెద్ద‌గా పట్టించుకోన‌ని, దేని గురించీ ఎక్కువ‌గా ఆలోచించ‌న‌ని వెంకీ చెప్పాడు. అదే ఇంట‌ర్వ్యూలో త‌న‌కు దేవుడు అంటే ఎంతో భ‌య‌మ‌ని, అరుణాచ‌లం అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పిన వెంకీ, ఘ‌ర్ష‌ణ టైమ్ లో తాను ఉన్న ప‌డ‌వ మునిగిపోయిన‌ప్ప‌టికీ దేవుడి ద‌య వ‌ల్లే ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌కుండా బ‌య‌ట‌పడిన‌ట్టు చెప్పారు.